Begin typing your search above and press return to search.

పండగ‌ చేసుకుని రెండేళ్ల‌యింది : ర‌వితేజ‌

By:  Tupaki Desk   |   30 Dec 2022 6:48 AM GMT
పండగ‌ చేసుకుని రెండేళ్ల‌యింది : ర‌వితేజ‌
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన లేటెస్ట్ ఎంట‌ర్ టైన‌ర్ 'ధామాకా'. ఈ ఏడాది ప్రారంభంలో బ్యాక్ లు బ్యాక్ ఫ్లాపుల్ని ద‌క్కించుకున్నా ర‌వితేజ 'ధ‌మాకా' మూవీతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'ఖిలాడీ', ఆ త‌రువాత 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్ని ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. ఈ రెండు సినిమాల త‌రువాత యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'ధ‌మాకా'తో ఊహించ‌ని విధంగా స‌క్సెస్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తున్నాడు. స‌క్సెస్ పండ‌గ చేసుకుని దాదాపు రెండేళ్లు అవుతోంద‌ని ఈ సంద‌ర్భంగా ర‌వితేజ గుర్తు చేసుకున్నారు.

'ధామాకా' మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రాంపేజ్‌ని కొన‌సాగిస్తున్న నేప‌థ్యంలో చిత్ర బృందం స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ ని నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ర‌వితేజ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 'ధ‌మాకా' కోసం ప‌ని చేసిన టెక్నీషియ‌న్స్ అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఎడిట‌ర్ ప్ర‌వీణ్ పూడి, ఆర్డ్ డైరెక్ట‌ర్ నాగేంద్ర‌, ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్ ల‌కు థాంక్స్ అన్నారు. టెక్నీషియ‌న్స్ అంతా అద్భుతంగా ప‌ని చేశారని, కార్తీక ఘ‌ట్ట‌మ‌నేని ఎక్స్ లెంట్ విజువ‌ల్స్ ఇచ్చాడ‌న్నారు. సినిమాలో అంద‌రం అందంగా వున్నామంటే దానికి కార‌ణం కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేనినే అన్నారు.

సినిమా విజ‌యానికి ప్ర‌ధాన కార‌ణం మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ అని త‌నుసాలీడ్ మ్యూజిక్ ని అందించాడ‌ని, ఈ సినిమాతో త‌ను నెక్స్ట్ లెవెల్ కి వెళ‌తాడ‌న్నారు. 'ధ‌మాకా' స‌క్సెస్ కి మ‌రో కార‌ణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వార‌ని, వారు సినిమాని ప్ర‌మోట్ చేసిన విధానం, సినిమాపై వారు చూపించిన పాజిటివిటీ చాలా ఆనందాన్ని క‌లిగించింద‌న్నారు. విశ్వ‌ప్ర‌సాద్‌, విశేక్ అద్భుత‌మైన వ్య‌క్తుల‌ని, ఈ బ్యాన‌ర్ లో నేను వ‌రుస‌గా సినిమా చేస్తాన‌ని తెలిపారు. తుల‌సీగారు, చ‌మ్మ‌క్ చంద్ర‌, జ‌య‌రాం గారు, చిరాగ్ ఇలా అంద‌రూ అద్భుతంగా న‌టించార‌న్నారు.

రావు ర‌మేష్, హైప‌ర్ ఆది 'ధ‌మాకా'లో మ‌రో హైలైట్. పాత సినిమాల్లో రావు గోపాల్ రావు, అల్లు ఆర‌మ‌లింగ‌య్య గారిలా అద్భుతంగా వినోదాన్ని పండించార‌ని తెలిపారు. శ్రీ‌లీల సినిమాకు మ‌ర‌నో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అందం, అభిన‌యం,ప్ర‌తిభ అన్నీ త‌న‌లో వున్నాయ‌న్నారు. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో త‌ను పెద్ద స్టార్ అవుతుంద‌న్నారు. సినిమా విజ‌యానికి ప్ర‌స‌న్న‌కుమార్ డైలాగ్ లు మ‌రో కార‌ణ‌మ‌ని, త‌ను రాసిన డైలాగ్ ల‌ని ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నార‌ని తెలిపారు.

'ఇంద్ర‌' స్ఫూఫ్‌, ప‌ర్స‌ర్ బైక్ సాంగ్ ఐడియా త‌న‌దేనన్నారు. రామ‌జోగ‌య్య శాస్త్రి, కాస‌ర్ల‌శ్యామ్ మంచి సాహిత్యాన్ని అందించార‌ని, సినిమాకు త్రినాథ‌రావు న‌క్కిన డ్రైవ‌ర్, నేను కండ‌క్ట‌ర్ అంటూ న‌వ్వులు కురిపించారు. త్రినాథ‌రావు, ప్ర‌స‌న్న కాంబో ఎప్పుడూ సూప‌ర్ హిట్టే. సెకండ్ హ్యాట్రిక్ లోకి ఎంట‌ర‌య్యారు. ధ‌మాకా సినిమాకు అభిమానులు చేసిన హ‌డావిడీ అంతా ఇంతా కాద‌ని, పండ‌గ చేసుకుని రెండేళ్ల‌వుతోంద‌ని, ఇక‌పై పండ‌క్కి గ్యాప్ ఇవ్వొద్దు. పండ‌గ‌మీద పండ‌గ చేసుకోవాలి' అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.