Begin typing your search above and press return to search.
అది ఎన్టీఆర్ వల్లనే అవుతుంది బాసూ: విష్వక్సేన్
By: Tupaki Desk | 6 May 2022 11:30 AM GMTవిష్వక్ సేన్ హీరోగా రూపొందిన 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విద్యాసాగర్ చింత ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. మొదటి నుంచి కూడా విష్వక్ తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అని చెబుతూ వస్తున్నాడు. ఆయన నటన .. డాన్స్ తనకి ఇష్టమని స్టేజ్ లపైనే చెబుతూ ఉంటాడు. అలాంటి విష్వక్ 'పాగల్' సినిమా చేసిన దగ్గర నుంచి ఆయన బాడీ లాంగ్వేజ్ ఎన్టీఆర్ కి దగ్గరగా ఉందనే టాక్ అచ్చింది. అలాగే మాస్ డైలాగ్స్ చెప్పేటప్పుడు కూడా ఎన్టీఆర్ గుర్తుకొస్తున్నాడని చెప్పినవాళ్లున్నారు.
ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో విష్వక్ మాట్లాడుతూ .. "నన్ను ఎన్టీఆర్ తో పోల్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలా గొప్ప స్టార్ .. గొప్ప డాన్సర్. అలాంటి ఆయనతో పోల్చడం నాకు సంతోషాన్నే కలిగిస్తుంది. అయితే నాదైన గుర్తింపును నేను కోరుకుంటున్నాను. ఆ దిశగానే ప్రయత్నిస్తున్నాను. యాక్టింగ్ పరంగా నా పై ఎన్టీఆర్ ప్రభావం లేదు. అయినా నాలో ఎన్టీఆర్ మేనరిజమ్స్ కనిపిస్తున్నాయంటే అది నాపై ఉన్న అభిమానమే. నేను కూడా ఎన్టీఆర్ అభిమానినే .. ఆయన సినిమాలను ఎక్కువగా చూస్తుంటాను.
ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో 'యమదొంగ' అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి పౌరాణికి సినిమాలు చేయాలంటే తెలుగు భాషపై మంచి పట్టు ఉండాలి. అప్పుడే అలా డైలాగులు టకాటకా చెప్పగలుగుతాము.
నేను అలా చెప్పలేను .. అది నా వలన కాదు. అలాంటి పాత్రను చేయాలంటే అదొక ఛాలెంజ్ లాంటిదే. వాళ్ల తాతగారి నుంచి వచ్చింది కావొచ్చు .. ఆ తరహా పాత్రలను ఎన్టీఆర్ అయితే బాగా చేస్తారు. ఇంకొకరు ట్రై చేయడం సాహసమే అవుతుంది.
ఇక నుంచి వరుస సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. సినిమాకి .. సినిమాకి మధ్య గ్యాప్ ఎక్కువ లేకుండా చూసుకుంటాను. ప్రస్తుతం రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. 'దాస్ కా ధమ్కీ' .. ' ఓరి దేవుడా' సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే నమ్మకం ఉంది. ఇక త్వరలో 'స్టూడెంట్ జిందాబాద్' సినిమాను కూడా చేయబోతున్నాను.
ఈ సినిమాను ఒక కొత్త దర్శకుడితో చేస్తాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఒక బాలీవుడ్ సినిమా చేసే ఆలోచన కూడా ఉంది" అని చెప్పుకొచ్చాడు.