Begin typing your search above and press return to search.
సరసమైన ధరలకే థియేటర్లకొస్తారని ప్రూవైంది!
By: Tupaki Desk | 23 Sep 2022 5:22 AM GMTటికెట్ రేట్ల తగ్గింపు లేదా పెంపు అనేది సినిమా వ్యూవర్ ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందా? అంటే అవుననేందుకు సరైన ఆధారం లభించింది. సినిమా రిలీజైన దాదాపు 15 రోజుల తరవాత తగ్గించిన రేటుతో టికెట్ ని విక్రయించగా జనం థియేటర్లలోకి పోటెత్తారు. మల్టీప్లెక్సుల్లో రికార్డ్ స్థాయిలో టికెట్లు అమ్ముడయ్యాయి.
రణబీర్ నటించిన 'బ్రహ్మాస్ట్ర' ఇప్పుడు సరి కొత్త రికార్డును సృష్టించింది. ఈ మూవీ విడుదలైన 15వ రోజున 6 లక్షలకు పైగా టిక్కెట్లు సేల్ అయ్యాయి. ఒక బాలీవుడ్ చిత్రం కోసం అత్యధిక ముందస్తు టికెట్ అమ్మకాల్లో ఇది రికార్డ్. బ్రహ్మాస్త్ర థియేట్రికల్ పరుగు 15వ రోజున ఈ రికార్డ్ నమోదయింది.
ఈ చిత్రం ఇప్పటికే రూ. 200 కోట్లు నెట్ సాధించిందని కథనాలొస్తున్నాయి. ఈ క్లబ్ లో చేరిన మొదటి సినిమా కాశ్మీర్ ఫైల్స్. తర్వాత భూల్ భులయా 2. జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా సబ్సిడీతో కూడిన టికెట్ లను విక్రయించగా రణబీర్ సినిమా కూడా గౌరవప్రదమైన 200కోట్ల క్లబ్ ని అధిగమించిందని టాక్ వినిపిస్తోంది. భారతదేశంలోని అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ లు జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.75 కే టికెట్ ని విక్రయించారు ఆ రోజుకి.
'బ్రహ్మాస్ట్ర' 6 లక్షలకు పైగా టిక్కెట్లను ఇండియా మల్టీప్లెక్స్ చైన్ ల లో 15వ రోజుకు ముందుగానే అమ్మేశారు. సబ్సిడీ రేట్లు రూ.75 కి తగ్గింపు అనేది చాలా సహాయపడింది. ఎందుకంటే ఇది ప్రారంభ రోజు లేదా రెండవ మూడవ రోజు కంటే ఎక్కువ పురోగతిని నమోదు చేసింది. ఒక్కరోజులో రూ. 35 కోట్ల నెట్ వసూలు చేసింది.
ఈ చిత్రం ఆడుతున్న థియేటర్లు ఆ ఒక్కరోజుకు కిటకిటలాడినా ఆ తర్వాత మళ్లీ యథాతథంగా మారింది. ఎగ్జిబిటర్లు ఆ రోజుకి వీలైనన్ని ఎక్కువ ప్రదర్శనలకు అనుగుణంగా ప్లాన్ చేసినా కానీ.. ఇకపై మరిన్ని ప్రదర్శనలను జోడించలేరు. మల్టీప్లెక్స్ లలో భారతదేశంలో ఒకే రోజున అత్యధిక ఫుట్ ఫాల్స్ ను సాధించడం గమనార్హం. భారతదేశంలో ఒకే రోజున మల్టీప్లెక్స్‌లను సందర్శించే ప్రజలశాతం ఒక రికార్డ్ గా నమోదైంది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆ మేరకు ప్రతిదీ అంగీకరించింది.
బ్రహ్మాస్ట్ర రికార్డు చూశాక ప్రేక్షకులు సరసమైన టికెట్ రేట్లు ఉంటే థియేటర్లకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా నిరూపించింది. వారాంతపు ప్రేక్షకులు చాలా మంది శుక్రవారం ఈ చిత్రాన్ని చూడటానికి తిరిగి రావాలనుకున్నందున శనివారం- ఆదివారం ముందస్తు అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ టికెటింగ్ వీకెండ్ భారతీయ థియేట్రికల్ రంగానికి ఎప్పటికీ బాక్సాఫీస్ డైనమిక్స్ ను మార్చనూవచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.