Begin typing your search above and press return to search.
బడా నిర్మాతకు ఆ కాంపౌండ్లో ఇక సినిమా కష్టమే!
By: Tupaki Desk | 10 Dec 2022 11:30 AM GMTఇటీవలే ఓస్టార్ ప్రొడ్యూసర్ వేచి చూసి చూసి ఆహీరో విషయంలో విసుగు చెందిన సంగతి తెలిసిందే. ఇక అతనితో పనవదని గ్రహించిన కొత్త హీరోల వేటలో పడ్డాడు. ముక్కు..ముఖం తెలియని నిర్మాతలందరికీ డేట్లు ఇస్తున్నాడు గానీ..ఎన్నో ఏళ్ల నుంచి తెలిసిన తనకి డేట్లు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వైనం కనిపిస్తుంది. అందుకే ప్రసాదలు విరివిగా పంచే గుడికే వెళ్లడం మంచిదని భావించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
మరి ఆ దేవుడు ఎందుకు డేట్లు ఇవ్వలేదు ? అన్నది కేవలం అతనికే తెలియాలి. అందరీకి ఇచ్చి తనకే ఎందుకు ఇవ్వలేదు అన్నది ఆనిర్మాతకు కాస్తా..కూస్తో ఐడియా ఉండే ఉంటుంది. మరి ఆ నిర్మాతకు టాలీవుడ్ లో మిగిలిన హీరో లైనా డేట్లు ఇచ్చే అవకాశం ఉందా? అంటే అదీ సులభమైన పనికాదు. ఉన్న టాప్ హీరోలంతా ఫుల్ బిజీగా ఉన్నారు.
పాన్ ఇండియా కథలంటూ వెతుకుతున్నారు. నాకు నిర్మాత కావాలని వెతికే హీరోలెవరూ లేరు. మరి ఆ స్టార్ కుటుంబం హీరోలెవరైనా కరుణించే అవకాశం ఉందా? అంటే అదీ లేదనే ఫిలిం సర్కిల్స్ లో చర్చకొస్తుంది. వాళ్లు వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. సొంత నిర్మాణ సంస్థలో భాగస్వామ్యంలో సినిమాలు చేసుకుంటున్నారు. కొత్త వాళ్లకు పార్టనర్ షిప్ కల్పించాలన్నా? చాలా విషయాలు ఆలోచిస్తారు.
వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత అవకాశం ఇవ్వాలా? లేదా? అని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుంటారు. ఇక ఈ స్టార్ ప్రొడ్యూసర్ విషయంలో కొంత నెగిటివ్ టాక్ కూడా ఉంది. అటు రాజకీయాలు..ఇటు సినిమాలు అంటూ రెండు పడవల ప్రయాణం సహా వ్యక్తిగతంగా అతనిపై వచ్చిన కొన్ని రకాల విమర్శలు కూడా ఇక్కడ లెక్కలోకి తీసుకుంటారు.
అవన్నీ చూసే ఆ స్టార్ హీరో అవకాశం ఇవ్వలేదని ఇప్పటికే కొన్ని కథనాలు వైరల్ అయ్యాయి. అలాంటప్పుడు ఆ కాంపౌండ్ హీరోలు మాత్రం ఎలా ఛాన్స్ ఇస్తారు? అని మరో సందేహం వ్యక్తం అవుతోంది. ఈనేపథ్యంలో ఆ బడా నిర్మాతలు స్టార్ హీరోలు వెంట పడకుండా టైర్ -2..మీడియం రేంజ్ హీరోల్ని సెట్ చేసుకోవడం మంచిదని వినిపిస్తుంది. మరి ఆ నిర్మాత పుర్రెలో ఏముందో ఆ పెరుమాళ్లకే ఎరుక.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.