Begin typing your search above and press return to search.
అనారోగ్యం చలితో 16 గంటలు నీటిలోనే మునకలేసిన నటి
By: Tupaki Desk | 4 April 2021 11:30 AM GMTకంగన సాహసవిన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినీప్రపంచంలో అన్యాయాల్ని ప్రశ్నించడం .. ఏటికి ఎదురెళ్లడం తనకు తొలి నుంచి అలవాటే. ఇక వృత్తిగతంగానూ కంగన డెడికేషన్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కంగన ఎంతో మొండి పట్టుదల ఉన్న నాయిక. తన పని కోసం ప్రాణం పెట్టేస్తుంది. ఒకసారి ముఖానికి మేకప్ వేసుకుని బరిలో దిగితే జీవించేస్తుంది.
ఇటీవలే తలైవి చిత్రం నుంచి తొలి సింగిల్ చలి చలి రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పాటలో కంగన జలకాలాటలు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. కథానాయిక జయలలిత యుక్తవయసులో ఎంత అందంగా ఉండేవారో.. అంతకుమించి కంగన అందంగా ఉందని ప్రశంసలు కురిసాయి. ఇక చలీ చలీ పాటలో జలకాలాటలాడుతూ కంగన అభినివేశం కుర్రకారు గుండెల్లోకి దూసుకెళ్లింది.
తాజా సమాచారం మేరకు .. ఈ పాట కోసం కంగన చాలా రిస్కులు చేసిందని తెలిసింది. ఓవైపు అనారోగ్యం.. మరోవైపు తనకు చలిగా ఉంది. కానీ ఆ పాట చిత్రీకరణ కోసం ఏకంగా 16 గంటలు నీటిలోనే తడిసి ముద్దయ్యిందట. అది నిజంగానే రిస్కీ ఫీట్ అని తెలిసింది.
వృత్తినిబద్ధత ఉన్న నటి కాబట్టే అన్ని గంటలు నీటిలో తడిసినట్లు చెబుతున్నారు. ఈ పాటను చిత్రీకరించడం నిర్మాతలకు పెద్ద సవాల్ గా నిలిచిందిట. కోవిడ్ మహమ్మారి లాక్ డౌన్ ముగిశాక.. ఈ పాటను పూర్తి చేయాలని ప్రయత్నించినా.. అప్పటికీ చాలా ఆంక్షలు అమల్లో ఉన్నందున కంగనా దాదాపు 8 నెలల తర్వాత తిరిగి సెట్ లోకి రాగలిగిందట. అయితే అంత వేచి చూసినందుకు చివరికి ఫలితం దక్కిందని మేకర్స్ ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జయలలిత -ఎంజిఆర్ నడుమ రహస్య ప్రేమకథను తలైవిలో తెరపైకి తెస్తుండడం ఆసక్తికరం. ఈ సినిమాకి సెంట్రల్ ఐడియానే ఇది అని తెలిసింది. ఈ చిత్రం జయలలిత పతనం.. ఒడిదుడుకులు అలాగే పెరుగుదలను ఆవిష్కరిస్తుంది. ఏప్రిల్ 23 న ఒకేసారి తెలుగు- తమిళం- హిందీలో విడుదల కానుంది. ఏ.ఎల్.విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.