Begin typing your search above and press return to search.

స‌ర్ ప్రైజ్ కాంబో.. AGENT తో మెగాస్టార్

By:  Tupaki Desk   |   19 Oct 2021 5:56 AM GMT
స‌ర్ ప్రైజ్ కాంబో.. AGENT తో మెగాస్టార్
X
అక్కినేని అఖిల్ క‌థానాయ‌కుడిగా సురెంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో స్పై థ్రిల్ల‌ర్ `ఏజెంట్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అఖిల్ ఓ స్పై ఏజెంట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. హీరోయిన్ గా న‌టిస్తోన్న సాక్షి వైద్య పాత్ర అంతే కీల‌కంగా ఉండ‌బోతుంది. ఏజెంట్ క‌థ గూఢ‌చ‌ర్యం నేపథ్యం అన్న‌ది మినహా క‌థ ఏదీ లీక్ కాని సంగ‌తి తెలిసిందే. కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిద‌ని ప్ర‌చారం ఉంది. సంచ‌ల‌నం సృష్టించిన హానీ ట్రాప్ క‌థాంశమ‌ని సోష‌ల్ మీడియాల్లో ఇప్ప‌టికే ప్ర‌చారం సాగింది. దీని వెనుక అస‌లు క‌థ ఏంటన్న‌ది సూరి రివీల్ చేస్తే గానీ క్లారిటీ రాదు. వ‌క్కంతం వంశీ క‌థ అందిస్తున్న నేప‌థ్యంలో కంటెట్ ప‌రంగా అఖిల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

సినిమాపైనా ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. సూరి త‌న‌దైన శైలి మేకింగ్ తో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో అఖిల్ ని మ‌రో లెవ‌ల్లో ఆవిష్క‌రిస్తార‌ని అంతా భావిస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఏజెంట్ లో ఓ కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి న‌టిస్తున్నారుట‌. మ‌మ్ముట్టి పాత్ర సినిమాకు చాలా కీల‌కంగా ఉంటుంద‌ని..ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఆ పాత్ర సాగుతుంద‌ని స‌మాచారం. అఖిల్-మ‌మ్ముట్టి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని అంటున్నారు. ఇక మ‌మ్ముట్టి తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా సుప‌రిచితులే.

ఇప్ప‌టికే చాలా అనువాద చిత్రాల‌తోనే ఆయ‌న వెల్ నోన్ ప‌ర్స‌న్ గా రీచ్ అయ్యారు. ఆ త‌ర్వాత నేరుగా తెలుగులో ఓ సినిమా చేసారు. ఆ మ‌ధ్య వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద యాత్ర నేప‌థ్యంలో తెర‌కెక్కిన `యాత్ర` లో రాజ‌న్న పాత్ర‌లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఆ సినిమా తో ఆయ‌నకు మంచి గుర్తింపు ద‌క్కింది. ఈ నేప‌థ్యంలో ఏజెంట్ కి ఆయ‌న ఎంపిక క‌లిసొచ్చేదే. ప్ర‌స్తుతం `ఏజెంట్` చిత్రీక‌ర‌ణ విదేశాల్లో జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ హైద‌రాబాద్.. వైజాగ్..నెల్లూరు లో పూర్తిచేసిన సంగ‌తి తెలిసిందే. విశాఖ పోర్ట్ లోనూ భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల్ని ఇంత‌కుముందు తెర‌కెక్కించారు.

ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ స‌క్సెస్ తో కిక్కు

అఖిల్ ఇప్ప‌టికే మూడు సినిమాల్లో న‌టించినా ఏ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపించ‌లేదు. కానీ నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అత‌డికి ఊపిరిలూదింద‌నే చెప్పాలి. సెకండ్ వేవ్ అనంత‌రం వ‌రుస‌గా సినిమాలు రిలీజ‌వుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కంటెంట్ ఉన్న సినిమాలు ఆడాయి. విదేశాల నుంచి రిపోర్ట్ పాజిటివ్ గానే ఉంది. ముఖ్యంగా అమెరికాలో` చ‌క్క‌ని వ‌సూళ్లు సాధించిన సినిమాలేవీ? అన్న‌ది ఆరా తీస్తే..అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ పేరు వినిపించడం అఖిల్ కి క‌లిసొచ్చే అంశం. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా తొలి వీకెండ్ చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను తెచ్చింది.

ఈసారి అఖిల్ విదేశాల్లోనూ నిరూపిస్తున్నాడు. దసరా వారాంతంలో ఓవ‌ర్సీస్ బాక్సాఫీస్ లెక్క‌లు చూస్తే.. అఖిల్ అక్కినేని నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మొదటి వారాంతంలో 450 కె డాల‌ర్లు (సుమారుగా) వసూలు చేసింది. హలో కాకుండా అఖిల్ అక్కినేని నటించిన రెండవ అతిపెద్ద క‌లెక్ష‌న్ ఇద‌ని తెలిసింది. బ్యాచిల‌ర్ గా అఖిల్ న‌ట‌న‌తో పాటు పూజా హెగ్డే బ్రిలియంట్ పెర్ఫామెన్స్ గ్లామ‌ర్ ఈ సినిమా విజ‌యానికి సాయ‌ప‌డ్డాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అమెరికా వ‌సూళ్ల‌ను ప‌రిశీలిస్తే.. శుక్ర వారం 228 కె డాల‌ర్లు.. శ‌నివారం- 142 కె డాల‌ర్లు.. ఆదివారం 70 కె డార్లు సుమారు వ‌సూలైంది. ఓవ‌రాల్ గా 3రోజుల మొత్తం 450 కె డాల‌ర్లు వ‌సూలైంది.