Begin typing your search above and press return to search.

నాని ని నిందించడం సరికాదు: 'లవ్ స్టోరీ' నిర్మాత

By:  Tupaki Desk   |   21 Aug 2021 3:30 PM GMT
నాని ని నిందించడం సరికాదు: లవ్ స్టోరీ నిర్మాత
X
'లవ్ స్టోరీ' చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్న రోజునే 'టక్ జగదీష్' చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తుండటంపై వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్ మీట్ లో ఎగ్జిబిటర్స్ దీన్ని ఖండించారు. ఈ సందర్భంగా పలువురు థియేటర్ యజమానులు దీనికి హీరో నాని ని బాధ్యుడిని చేస్తూ నిందించారు.

'లవ్‌ స్టోరీ' సినిమాని థియేటర్లలో విడుదల చేస్తున్న రోజే 'టక్ జగదీష్' ఓటీటీలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని.. దీని వల్ల నిర్మాతలు ఎగ్జిబిటర్స్ అందరూ నష్టపోతారని అన్నారు. థియేటర్ల గురించి హీరో నాని మాట్లాడిన మాటలు 'ట‌క్ జ‌గ‌దీష్‌' కు ఎక్కువ ఓటీటీ ధర రాబ‌ట్టుకోవ‌డానికే అని.. స్టేజ్‌ ఎక్కి థియేటర్ల పేరు చెప్పి నాని రూ.4 కోట్లు అదనంగా సంపాదించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెక్రటరీ 'ఏషియన్‌' సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ.. "మా ఎగ్జిబిటర్స్ కొందరు నాని ని బ్లేమ్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. వారు నిరాశతో అలా మాట్లాడారు అంతే. కానీ అది నిర్మాతల నిర్ణయం అనే విషయం మనం తెలుసుకోవాలి. అది వారి ప్రోడక్ట్. కానీ హీరోలు కూడా థియేటర్లకు సపోర్ట్ చేయాలి" అని అన్నారు.

"ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రావడం నిర్మాతలకు ఎగ్జిబిటర్స్ కు పెద్ద నష్టం. దీని వల్ల చివరికి నిర్మాతలు నష్టపోతారు. ఈ రోజు 'లవ్ స్టోరీ' కి జరిగింది రాబోయే రోజు అందరికీ జరుగుతుంది. మేం ఇప్పుడు బ్రతిమాలుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ మేము దీనిపై అతి త్వరలో బలమైన వైఖరిని తీసుకుంటాం'' అని సునీల్ నారంగ్ అన్నారు.

నిన్న శుక్రవారం తెలంగాణ ఎగ్జిబిటర్స్ సమావేశంలో సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. 'టక్ జగదీష్' నిర్మాతలు విడుదల తేదీ గురించి మరోసారి ఆలోచించుకోవాలి. 'లవ్ స్టొరీ' రిలీజ్ డేట్ ని ప్రకటించిన తర్వాత అదే రోజున మరో చిత్రాన్ని విడుదల చేయడం సరికాదు. సెప్టెంబర్ 10 నుండి వాయిదా వేసుకోవాలని వారిని అభ్యర్థిస్తున్నాము. ఇది చివరకు ప్రొడ్యూసర్ కే ప్రాబ్లమ్ అవుతుంది. అది వాళ్ళకి అర్థం కావడం లేదు'' అని అన్నారు.

'నారప్ప' 'మాస్ట్రో' చిత్రాలను ఓటీటీలకు ఇస్తున్న నేపథ్యంలో అక్టోబర్‌ 31వరకూ ఓటీటీలకు సినిమాలను అమ్మవద్దని నిర్మాతలకు చెప్పాం. అయినా సరే 'టక్‌ జగదీష్‌' నిర్మాతలు అమెజాన్‌ ప్రైమ్‌ కు ఇచ్చారు. మేము ఫోన్‌ చేసి అడిగితే ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పారు. అయితే ఇప్పుడు 'లవ్‌ స్టోరి' విడుదల రోజునే ఓటీటీలో 'టక్‌ జగదీష్‌' రిలీజ్ అవుతుందని మా దృష్టికి వచ్చింది. ఈ విధంగా చేస్తే చివరకు నిర్మాతలు నష్టపోతారు. కనీసం పండగలకు ఓటీటీల్లో కొత్త చిత్రాలు విడుదల కాకుండా చూడాలని, ఆ విధంగా అగ్రిమెంట్లు చేసుకోవాలని నిర్మాతలను కోరుతున్నాం అని సునీల్ నారంగ్ మాట్లాడారు.