Begin typing your search above and press return to search.
MAA తర్వాత అతి పెద్ద ఆర్టిస్టుల సంఘం ఇదే
By: Tupaki Desk | 10 Oct 2022 2:50 PM GMTటాలీవుడ్ లో దాదాపు 900 పైగా సభ్యులతో మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అతి పెద్ద అసోసియేషన్ గా కొనసాగుతోంది. అయితే `మా`లో సభ్యత్వం కావాలంటే లక్షల్లో ధారపోయాలి. అలాంటి అవసరం లేకుండానే వేలు ఖర్చుతోనే సభ్యత్వం అందిస్తూ అతి పెద్ద అసోసియేషన్ గా అవతరించింది తెలుగు మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘం.
ప్రస్తుతం ఇందులో సుమారు 1000 మంది వరకూ ఆర్టిస్టులు రిజిస్టర్ అయ్యి ఉన్నారు. దీనిని TMTAU అని పిలుస్తున్నారు. గడిచిన దశాబ్ధ కాలంగా మనుగడలో ఉన్న ఈ అసోసియేషన్ టాలీవుడ్ లో అంతకంతకు బలపడుతోందని సీనియర్ నటులు ఒకరు వెల్లడించారు.
తాజాగా జరిగిన ఈసీ మీటింగులో యూనియన్ సంక్షేమం అభివృద్ధికి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు చర్చించారు. అందులో భాగంగా యూనియన్ రెన్యూవల్ కి సంబంధించి సమయం ముగిసిందని... దాని తరువాత రెన్యూవల్ ఫార్మ్స్ ఆఫీసుకి వచ్చి నింపి వెబ్ సైట్ లో మన మెంబర్స్ వివరాలు ఫోటోలు పొందుపరచుకోమని సభ్యులకు సందేశం అందించారు.
త్వరలోనే వెబ్ సైట్ ని ఆఫీషియల్ గా ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఈ అధికారిక సైట్ ను దసరా పండుగకు ముందుగాని తరువాత గాని ఒక ప్రముఖ స్టార్ హీరో తో ప్రారంభించడానికి కమిటీ ముందుకి వెళుతుంది అని టీఎంటీఏయు అధికార ప్రతినిధి తెలియజేసారు.
కొత్త కార్డ్స్ ఇష్యూ విషయంలో కమీటీకి అందరు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. గత నెలలో ఆవుల సోమశేఖర్ గారిని ఈసీ మెంబర్ గా తొలగించి వారి స్థానంలో కో ఆప్షన్ పద్దతిలో కొత్త సభ్యున్ని ఎన్నుకునే ప్రక్రియలో కమిటీ ముందు ఇద్దరి సభ్యుల పేర్లు రాగా అందులో శ్రీ S. R. S. ప్రసాద్ గారిని నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా అందరు సభ్యులు ఆమోదించారు. వారికి యూనియన్ కుటుంబం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని TMTAU కమిటీ ప్రకటించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.