Begin typing your search above and press return to search.
శర్వా ని ఒప్పించడం అంత ఈజీ కాదు..!
By: Tupaki Desk | 10 Nov 2022 1:30 PM GMTమాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో తలపెట్టిన సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య ని టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం చేస్తూ.. విశ్వక్ తో ఓ ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. అయితే దర్శక హీరోల మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో ఈ సినిమా ముందుకు వెళ్ళలేదు.
ఇటీవల అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తాను విశ్వక్ సేన్ తో పని చేయలేనని వెల్లడించారు. అంతేకాదు త్వరలోనే ఈ సినిమా మరొక హీరోతో చేస్తానని.. టైటిల్ కూడా అనౌన్స్ చేస్తానని సీనియర్ హీరో తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ వర్సటైల్ హీరో శర్వానంద్ తో ఈ చిత్రాన్ని చేయాలని అర్జున్ ఆలోచిస్తున్నట్లుగా నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి.
తన స్క్రిప్ట్ కు శర్వా అయితే సరిపోతాడని భావించిన అర్జున్.. ఇప్పుడు యువ కథానాయకుడిని సంప్రదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వచ్చింది. దీంతో విశ్వక్ సేన్ వదిలేసిన సినిమాని శర్వానంద్ చేయడానికి ఒప్పుకుంటాడా? అర్జున్ ఈ కథతో శర్వా ని ఒప్పించగలడా లేదా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది.
స్క్రిప్ట్ లో తాను చెప్పిన చిన్న చిన్న మార్పులు చేయడానికి అర్జున్ ఒప్పుకోకపోవడం వల్లనే తాను షూటింగ్ కు వెళ్లలేకపోయాయని విశ్వక్ ఇటీవల తెలిపారు. అలాంటిది ఇప్పుడు శర్వా ని కలిసేది నిజమే అయితే.. ఎలాంటి మార్పులు చేయకుండా ఆ కథని చేయడానికి అంగీకరిస్తాడా? అనేది ప్రశ్నార్ధంకంగా మారింది.
వైవిధ్యమైన సినిమాలతో శర్వానంద్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అతనికంటూ ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉంది. వరుసగా పరాజయాలు పలకరించినా కూడా.. సరికొత్త కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తుంటాడు.. స్క్రిప్ట్ విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడు శర్వా.
మరోవైపు అర్జున్ తన సినిమాలో హీరోని మార్చడానికి కూడా రెడీ కానీ.. స్క్రిప్ట్ లో చిన్న చేంజెస్ చేయడానికి కూడా ఇష్టపడడని ఇటీవల వివాదాన్ని బట్టి అర్థమవుతోంది. ఎవరు రాసుకున్న కథనంపై వాళ్ళకి అంత నమ్మకం ఉండటంలో తప్పులేదు. కానీ శర్వా ఎలాంటి మార్పులు చెప్పకుండా అదే కథని ఓకే చేస్తాడా? అనేది అనుమానమే.
అలానే విశ్వక్ కు చెప్పిన అదే స్క్రిప్ట్ తో శర్వా ని అర్జున్ మెప్పించగలడా? ఒకవేళ శర్వా మార్పులు చెబితే చేయడానికి ఓకే అంటాడా? విశ్వక్ ని ఒప్పించినంత ఈజీగా శర్వా తో ఓకే అనిపించగలడా? హీరో మార్కెట్ కు తగ్గట్టుగా సినిమా చేయడానికి అర్జున్ రెడీగా ఉంటాడా? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.
అందులోనూ శర్వానంద్ అర డజను ప్లాప్స్ తర్వాత ఇటీవల 'ఒకే ఒక జీవితం' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. తదుపరి సినిమాల స్క్రిప్ట్స్ విషయంలో మరింత జాగ్రత్త వహించే అవకాశం ఉంది. అంత ఈజీగా ఏ కథని ఓకే చేయకపోవచ్చు. మరి ఆ తరం హీరో అర్జున్ రాసిన స్క్రిప్ట్ ని ఈ తరం హీరో శర్వా అంగీకరిస్తారా లేదా? అనేది వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.