Begin typing your search above and press return to search.

ఇట్స్ అఫిషియల్.. పెళ్లి కూతురిని పరిచయం చేసిన మనోజ్

By:  Tupaki Desk   |   3 March 2023 12:54 PM GMT
ఇట్స్ అఫిషియల్.. పెళ్లి కూతురిని పరిచయం చేసిన మనోజ్
X
మంచు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కుమారుడు మంచు మనోజ్ రెండో పెళ్లికి ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. స్వయంగా మంచు మనోజ్‌ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. మంచు మనోజ్ భూమా మౌనికరెడ్డిల వివాహాం నేడు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటన రాలేదు కానీ... తాజాగా మంచు మనోజ్ మాత్రం తన సోషల్ మీడియా ఖాతా వేదికగా.. ఓ పోస్ట్ పెట్టారు.

పెళ్లి కూతురు అంటూ భూమా మౌనిక ఫోటోను పోస్ట్ చేస్తూ... దీనికి మనోజ్ వెడ్స్ మౌనిక అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. అయితే ముహూర్తం క్లారిటీగా చెప్పలేదు... కానీ ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్ఫై నిమిషాలకు ఉంటుందని సమాచారం. ఇక ఈ పెళ్లి హడావుడి లేకుండా సైలెంట్గా అతి తక్కువ మంది సమక్షంలోనే జరగబోతుందని తెలుస్తోంది. ఈ వివాహ కార్యక్రమానికి కొద్ది మందే వస్తారని సమాచారం.

ఇక మంచు మనోజ్ రెండో పెళ్లి మీద రకరకాల కామెంట్లు అయితే వచ్చాయి. అయినప్పటికీ దీనిపై మంచు మనోజ్ ఎప్పుడూ స్పందించలేదు. మొత్తానికి మంచు వారింట్లో ఇప్పుడ సంబరాలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం మంచు మనోజ్ రెండో పెళ్లి మీద సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లే కనిపిస్తున్నాయి. కాగా గతంలో మంచు మనోజ్‌కు ప్రణతి అనే యువతితో పెళ్లి జరిగింది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఇక మౌనికకు కూడా ఇది రెండో పెళ్లే. ఆమె కూడా విడాకులు తీసుకున్నారు.

ఇక మనోజ్‌ సినిమాల విషయానికి వస్తే.. ఆయన గతంలో ప్రకటించిన 'అహం బ్రహ్మాస్మి' అనే పాన్ ఇండియా సినిమా ప్రకటించారు. కానీ ఇది మధ్యలోనే నిలిచిపోయింది. రీసెంట్గా మళ్లీ 'వాట్‌ ది ఫిష్‌' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేస్తున్నట్లు తెలిపారు. మరి ఈ ఏడాది మంచు మనోజ్ పర్సనల్ లైఫ్‌, సినీ లైఫ్‌ కలిసి వచ్చేలానే ఉందని అంటున్నారు. చూడాలి ఇక మంచు మనోజ్కు ఈ పెళ్లితో కలిసి వస్తోందో లేదో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.