Begin typing your search above and press return to search.

ఆ నిర్మాతపై ఐటీ దాడులు.. ఎందుకో?

By:  Tupaki Desk   |   22 Sep 2016 10:51 AM GMT
ఆ నిర్మాతపై ఐటీ దాడులు.. ఎందుకో?
X
టాలీవుడ్ లో జోరు మీదున్న ప్రొడ్యూసర్లలో సాయి కొర్రపాటి పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. గత కొంత కాలంగా సినిమా వాళ్లపై ఐటీ శాఖ దాడులు చేసిన వార్తలు వినిపించడం లేదు. గతంలో ఏ కొత్త సినిమా రిలీజ్ అవుతున్నా.. ఈ మూవీ నిర్మాతల ఇల్లు-ఆఫీసులపై ఐటీ దాడులు జరిగేవి. కొన్నాళ్లుగా సినిమారంగాన్ని పెద్దగా పట్టించుకోని ఐటీ శాఖ.. ఇప్పుడు సాయి కొర్రపాటి ఇల్లు-ఆఫీస్ లను తనిఖీ చేయడం హాట్ న్యూస్ అయిపోయింది.

ఈగ.. ఊహలు గుసగుసలాడే వంటి చిత్రాలతో పాటు.. రీసెంట్ మనమంతా.. జ్యో అచ్యుతానందవరకూ అనేక మంచి సినిమాలను తీసిన అనుభవం సాయి కొర్రపాటికి ఉంది. ఇటు నిర్మాతగా బిజిగా ఉంటూనే.. మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గానూ సత్తా చాటుతున్నాడు. తాజాగా బాహుబలి 2 కి కూడా కొన్ని పెద్ద ఏరియాలకు రైట్స్ తీసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత స్పీడ్ చూపిస్తున్న ఈ ప్రొడ్యూకర్ కం డిస్ట్రిబ్యూటర్ పై దాడులు చేసిన ఐటీశాఖ.. దాదాపు 6 గంటలపాటు ప్రశ్నలు గుప్పించింది.

ఆదాయానికి సంబంధించిన మూలాలపైనా..అకౌంట్స్ లో కనిపిస్తున్న తేడాలపైనా ప్రశ్నలు సంధించారని తెలుస్తోంది. తన దగ్గరున్న అన్ని రకాల పత్రాలను సాయి కొర్రపాటి సమర్పించగా.. వీటిలో తేడాలు ఉన్నాయో లేదో మాత్రం ఆదాయపు పన్ను శాఖ వెల్లడించలేదు.