Begin typing your search above and press return to search.
ఆ ముగ్గురి నుంచే 25 కోట్లు డుమ్మా
By: Tupaki Desk | 2 Oct 2015 4:54 AM GMTసరైన టైమింగ్ తో దెబ్బ వేయడం అంటే ఇదే. మొన్నటిరోజున ఆదాయపన్ను శాఖ అధికారులు సెలబ్రిటీలకు దిమ్మతిరిగే ట్రీట్ ఇచ్చారు. స్టార్ల ఇల్లు - ఆఫీస్ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేసి కోట్లాది రూపాయల బ్లాక్ మనీని వెలికి తీశారు. ముఖ్యంగా పులి రిలీజ్ టైమ్ లో ఆ సినిమా హీరో విజయ్ కి ఓ రేంజులో పంచ్ పడింది. అలాగే పులి నిర్మాతలకు - ఫైనాన్సియర్లకు కూడా అదే రేంజులో పంచ్ పడింది. పులి నిర్మాతలు శిబు తమీన్ - పి.టి.సెల్వకుమార్ - ఫైనాన్సియర్స్ మధురై అన్బు - రమేష్ తదితరుల ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. భారీగా పత్రాల్ని స్వాధీనపరుచుకుని పన్ను బకాయిల్ని ముక్కు పిండి మరీ వసూలు చేసేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ ఐటీ రెయిడ్స్ లో పెద్ద రేంజులో పంచ్ పడింది ఎవరికి అంటే హీరో విజయ్ - సమంత - నయనతార .. ఈ ముగ్గురికి అని చెబుతున్నారు.
కేవలం ఈ ముగ్గురు నుంచి దాదాపు 25 కోట్లు పన్ను బకాయి పడి ఉందని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఈ కఠోర వాస్తవం ఇటు అభిమానుల్ని అటు సినీప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేవలం విజయ్ - సమంత - నయతార .. ఈ ముగ్గరి రూపంలోనే 25 కోట్ల పన్ను ఎగనామం పెట్టారని తెలుస్తోంది. విజయ్ ఐదేళ్లుగా పన్ను చెల్లించడం లేదు. సమంత - నయన్ కొంత మేర చెల్లించారు. కట్టాల్సింది చాలా ఉంది. ఈ ముగ్గురి నుంచి 2 కోట్ల క్యాష్ - 2కోట్ల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఆదాయపన్ను శాఖ ఇచ్చిన ఝలక్‌తో పులి రిలీజ్ వాయిదాపడడం నిర్మాతలకు, పంపిణీదారులకు పెద్ద శాపం అయ్యింది. మొదటి రోజు ప్రీమియర్‌ల రూపంలో రావాల్సిన మొత్తం పోయినట్టే. తమిళ వెర్షన్ ఉదయం ఆట వేయకపోయినా మ్యాట్నీ నుంచి ఆడుతోంది. తెలుగు వెర్షన్ నిన్న రిలీజ్ కాలేదు. ఓవర్సీస్ లో బుధవారం వేయాల్సిన ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేశారు. ఏ కోణంలో చూసినా పులికి ముచ్చెమటలే. ఈ నష్టాన్ని బర్తీ చేస్తూ పులి తమిళ్, తెలుగు వెర్షన్ రూపంలో భారీ విజయం అందుకుంటుందేమో చూడాలి.