Begin typing your search above and press return to search.
గీతా ఆర్ట్స్ ఆఫీస్ పై ఐటీ దాడులు!
By: Tupaki Desk | 8 March 2019 12:16 PM GMTస్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు సంబంధించిన గీతా ఆర్ట్స్ ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారాని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. నిన్న రాత్రి ఈ ఐటీ ఈ దాడులు జరిగాయని సమాచారం. ఈ దాడులకు సంబంధించిన విషయం బైటకు పొక్కిన వెంటనే టాలీవుడ్ లో ఇతర ప్రొడ్యూసర్లు.. డిస్ట్రిబ్యూటర్లు జాగ్రత్తపడ్డారట.
ఈ దాడుల గురించి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా ఐటీ శాఖ వారు చేపట్టే వ్యవహారమని అంటున్నారు. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి గానూ గీతా ఆర్ట్స్ వారికి 'గీత గోవిందం'.. 'టాక్సీవాలా' రూపంలో రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. ఆ నేపథ్యంలోనే ఆ సినిమాల కలెక్షన్స్ లెక్కలు సరిగా ఉన్నాయా లేదా చూసేందుకు ఈ దాడులు జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
అయితే ఈ దాడులకు సంబంధించి అధికారికంగా మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అటు ఆదాయపు పన్ను శాఖ అధికారులు కానీ ఇటు గీతా ఆర్ట్స్ వర్గాలు కానీ ఈ దాడుల విషయంపై ఇంతవరకూ స్పందించలేదు.