Begin typing your search above and press return to search.
నారా రోహిత్ పై ఐటీ దాడి జరిగింది.. కానీ!
By: Tupaki Desk | 4 Jan 2017 9:10 AM GMTగత కొన్ని నెలల్లో బ్లాక్ మనీ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. సినిమా వాళ్లపై పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరుగుతున్నాయి. ‘బాహుబలి’ నిర్మాతలతో పాటు చాలామంది సినిమా వాళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఐతే ఈ ఐటీ దాడులకు సంబంధించి ఇప్పటిదాకా ఉన్న లిస్టులోకి నారా రోహిత్ పేరు చేరడమే అందరికీ ఆశ్చర్యం కలిగించింది. రోహిత్ పెదనాన్న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయి ఉండి కూడా రోహిత్ మీద ఐటీ దాడులేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. ఐతే ఎవరూ ఐటీ దాడులకు అతీతం కాదని దీన్ని బట్టి తేలిపోయింది. నారా రోహిత్ కూడా ఈ దాడుల విషయంలో అభ్యంతరమేమీ పెట్టలేదంటున్నారు.
రోహిత్ నిర్మాతగా మారి తొలిసారి రూపొందించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చాలా మంచి టాక్ తో రన్ అవుతోంది. ఈ సినిమా రూ.20 కోట్ల దాకా వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారా రోహిత్ ఇంటిపై.. కార్యాలయంపై ఐటీ శాఖ దాడులు చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఐతే తాజా సమాచారం ఏంటంటే.. ఐటీ అధికారులు దాడులు చేసిన మాట వాస్తవమే కానీ.. అక్కడ అక్రమంగా ఏమీ దొరకలేదట. లెక్కలన్నీ పక్కాగా ఉండటం.. డాక్యుమెంట్లు చూపించడంతో అధికారులు చెయ్యి కలిపి వెనుదిరిగారట. ఇలాంటి పరీక్ష ఎదుర్కొని బయటపడితే ఇమేజ్ ఇంకా మంచి ఇమేజ్ వస్తుంది. కాబట్టి ఒకరకంగా ఇది నారా రోహిత్ కు మంచి చేసేదే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/