Begin typing your search above and press return to search.
‘బిగిల్’ ఐటీ హడావుడి.. ఈసారి ఆమె వంతు
By: Tupaki Desk | 13 Feb 2020 11:30 AM GMTగత కొద్ది రోజులుగా తమిళనాట ఐటీ అధికారులు పూర్తి దృష్టి బిగిల్ చిత్ర నిర్మాత.. హీరోపైనే పెట్టినట్లుగా అనిపిస్తుంది. విజయ్ ను టార్గెట్ గా చేసి బీజేపీ నాయకులు ఈ ఐటీ దాడులు చేయిస్తున్నారంటూ తమిళ ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు ఆరోపిస్తూ ఉన్నారు. ఎవరేం అనుకున్నా.. ఎలాంటి విమర్శలు వచ్చినా కూడా ఐటీ అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఇంకా బిగిల్ చిత్ర నిర్మాత ఆర్థిక అవక తవకలపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాక పోవడం తో విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు.
నేడు విజయ్ షూటింగ్ తో బిజీగా ఉన్న కారణంగా ఆయన ఆడిటర్ ఐటీ అధికారుల విచారణకు హాజరు అయ్యాడు. ఇదే సమయంలో నిర్మాత అఘోరం కల్పత్తి కూతురు అర్చనను ఆదాయపన్ను శాఖ అధికారులు విచారించారు. ఈమెకు ఏజీఎస్ సంస్థతో ఉన్న సంబంధం ఏంటీ.. సినిమా వసూళ్ల విషయాన్ని ట్విట్టర్ లో ఏ ప్రాతిపధిక పోస్ట్ చేశారు.. సినిమా నిర్మాణ వ్యవహారాల్లో మీ భాగస్వామ్యం ఎంత ఉంది.. ఇంకా మీకు తెలిసిన లెక్కలు ఏంటీ అంటూ ఆమెను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
ఏజీఎస్ సంస్థ ఆఫీస్ ల నుండి ఐటీ అధికారులు పెద్ద మొత్తం లో నగదు మరియు విలువైన ఆభరణాలు వజ్రాలను స్వాదీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వాటి తాలూకు లెక్కలను ఏజీఎస్ సంస్థ వారు చూపించాల్సి ఉంది. అందులో భాగంగానే ఏజీఎస్ సంస్థ కు చెందిన భాగస్వామి అయిన అర్చనను విచారించినట్లుగా తెలుస్తోంది. ఐటీ అధికారులు ఈ వ్యవహారాన్ని ఎక్కడ వరకు తీసుకు వెళ్తారా అంటూ తమిళ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.