Begin typing your search above and press return to search.
బాహుబలి.. ఈ అగర్వాల్ ఎవరు నానా???
By: Tupaki Desk | 13 Nov 2016 12:08 AM GMTఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ర్టీలో ఎక్కడ చూసినా కూడా విపరీతమైన క్యాష్ క్రంచ్ ఉంది. అందుకే చాలా సినిమాల షూటింగ్ ఆగిపోయింది అంటున్నారు. అయితే ఈ సినిమాల కథ ఒకెత్తయితే.. ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో 'బాహుబలి' నిర్మాతల దగ్గర దాదాపు 55 కోట్ల రూపాయల డబ్బును స్వాధీన పరుచుకున్నారనేది మరో టాక్. ఇంతకీ అసలు ఒక ప్రముఖ తెలుగు మీడియా సంస్థ ప్రచురణ ప్రకారం ఈ బాహుబలి దాడుల కథేంటి అంటే...
ఎప్పుడైతే గవర్నమెంటు వారు బ్యాంకుల్లో 2.5 లక్షల క్యాష్ వరకు మాత్రమే మీరు వేసుకునే సౌలభ్యం ఉంది.. ఆపైన మీరు ఎంత వేసినా కూడా దానికి సరైన లెక్కలు చెప్పి.. ఆదాయం సోర్స్ ఏంటో చూపించి.. అప్పుడు మనం విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆ విత్ డ్రాపై కొన్ని లిమిటేషన్లు ఉన్నాయ్. అయితే ఏంటి.. బెంగుళూరుకు చెందిన అగర్వాల్ అనే వ్యక్తి.. తన దగ్గర పనిచేసే చాలామంది ఎంప్లాయిస్ తో.. అలాగే వారి ఫ్యామిలీ మెంబర్లతో కలిపి.. కొన్ని కోట్ల రూపాయలను 2.5 లక్షలుగా విడగొట్టి.. వారి సొంత ఎకౌంట్లలో వేయించాడు. అవన్నీ తిరిగి చెక్ లేదా ఆన్ లైన్ ట్రాన్సపర్ రూపంలో తన దగ్గరకు తెచ్చుకున్నాడు. ఆ విధంగా ఒక 30 కోట్లను వైట్ మనీగా మార్చాడు. బాగానే ఉంది. కాని ఇలాంటి జరుగుతాయని ఐటి డిపార్టుమెంట్ ఊహించదా ఏంటి? అందుకే వారు స్కెచ్ వేసి అగర్వాల్ ను పట్టేసుకున్నారు.
కట్ చేస్తే.. అసలు అగర్వాల్ కు అంత డబ్బు ఎక్కడిది అని తెలుసుకున్న ఐటి అండ్ ఎన్ఫోర్సమెంట్ డిపార్టమెంట్ అధికారులు.. మనోడు బాహుబలి సినిమా డిస్ర్టిబ్యూషన్ లో కూడా వేలెట్టాడని తెలుసుకున్నారు. కట్ చేస్తే హైదరాబాదులో ఏకంగా బాహుబలి నిర్మాతలు అయిన శోభు యార్లగడ్డ.. ప్రసాద్ దేవినేనికి చెందిన ఏకంగా ఆరు చోట్లపై ఒకేసారి దాడులు చేశారట. మొత్తంగా ఈ దాడుల్లో 55 కోట్లు పట్టుబడ్డాయని తెలుస్తోంది. అలాగే ఈ మనీ అంతా వైట్ అంటూ బాహుబలి నిర్మాతలు వాధిస్తుంటే.. కాదు ఇదంతా బ్లాకే అనే ఫీలింగుతో ఆ డబ్బుతో పాటు చాలా లావాదేవీల పత్రాలను కూడా ఐటి అధికారులు సీజ్ చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి.
బాహుబలి సినిమాలో అసలు కట్టప్ప ఎందుకు చంపాడు అనేదే పెద్ద ప్రశ్న అయితే.. ఇప్పుడు అసలు ఈ అగర్వాల్ ఎవరు.. బాహుబలి 2 పరిస్థితి ఏంటి అనేదే ఇంకాస్త పెద్ద ప్రశ్న.