Begin typing your search above and press return to search.

ఖైదీ డిస్ర్టిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఫుల్ ఎలర్ట్

By:  Tupaki Desk   |   2 Feb 2017 12:33 PM GMT
ఖైదీ డిస్ర్టిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఫుల్ ఎలర్ట్
X
అసలు సినిమాకు 100 కోట్ల షేర్ వచ్చిందంటే.. అది ప్రొడ్యూసర్ జేబులోకి వచ్చిన డబ్బు. అంటే ప్రేక్షకుల దగ్గర నుండి ధియేటర్ల దగ్గర వసూలైంది 150 కోట్ల వరకు ఉంటుంది. ఆ రేంజులో వచ్చిందంటే.. మరి కేవలం ప్రొడ్యూసర్ ను మాత్రమే ఇనకమ్ ట్యాక్స్ అధికారులు రైడ్ చేస్తే ఎలా? ధియేటర్ల ఓనర్ల నుండి పంపిణీదారులు కమ్ బయ్యర్ల వరకు అందరినీ కాచి వడకట్టాల్సిందేగా. సరిగ్గా ఇలాంటి సందేహమే కొందరికి వచ్చింది. అ సందేహం ఒక రూమర్ గా మొదలై.. గోదావరి జిల్లాలను షేక్ చేసింది.

ఈ రోజు ఉదయం గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల ఖైదీ నెం 150 డిస్ర్టిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్స్ మీద ఐటి శాఖ రైడ్స్ జరుగుతుందని టాక్ వచ్చింది. ఈ రైడ్ సమాచారాన్ని అందుకున్న కొందరు బడా బాబులు.. ధియేటర్లలో ఉన్న ఎకౌంట్ పుస్తకాలను తీసుకుని జంప్ అయిపోయారట. ఇప్పటికే టౌన్లలో కంప్యూటరైజ్డ్ బుక్కింగ్ వచ్చేసినా కూడా.. ఇంకా కొన్ని బి అండ్ సి సెంటర్లలో మాత్రం పాత కాలంలో అమ్మినట్లు టిక్కెట్టు ముక్కలు మ్యానువల్ గానే నెంబరింగ్ వేసి అమ్ముతున్నారు. అప్పుడు ఎక్కువ టిక్కెట్లు అమ్మేసి.. అబ్బే మేం అన్ని అమ్మలేదు అని చెప్పే ఛాన్సుంటుంది. అయితే చివరకు ఈ రైడ్ న్యూస్ అంతా జస్ట్ రూమర్ అని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారట.

అసలు ఈ ఏరియాల్లో వచ్చిన లెక్కలను నిర్మాతల దగ్గర తెలుసుకుని.. అదే సమయంలో అవన్నీ కరక్టుగా ఉన్నాయా లేదా అని వెరిఫై చేయడానికి.. స్థానిక ఎగ్జిబిటర్లపై ఐటి శాఖ దాడి చేసే ఛాన్సు మాత్రం లేకపోలేదు. . మొత్తానికి ఖైదీ నెం 150 సినిమాతో ఎంత భారీగా కలక్షన్లు వచ్చినా.. అంతే భారీగా రైడ్స్ కూడా జరగొచ్చని ఎప్పుడో కొందరు నిపుణులు వెల్లడించారు. ఇప్పటికే గౌతమిపుత్ర శాతకర్ణి నిర్మాతలు అండ్ పంపిణీదారులపై ఇలాంటి దాడులే జరిగాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/