Begin typing your search above and press return to search.
మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ కన్ను.. హఠాత్తుగా సోదాలు
By: Tupaki Desk | 12 Dec 2022 9:30 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమంలో ఇప్పుడు అగ్ర నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న మైత్రి మూవీ మేకర్స్ పై హఠాత్తుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులపై కూడా ఐటీ డిపార్ట్మెంట్ స్పెషల్ ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. అయితే రాజకీయ నాయకులతో కూడా సినిమా నిర్మాతలకు సంబంధాలు ఉన్నాయి అనే లింక్స్ కూడా కొన్ని బయటపడుతున్నట్లుగా టాక్ వస్తోంది.
ఈ తరుణంలోనే ఐటి అధికారులు ఒక్కసారిగా మైత్రి మూవీస్ ఆఫీసులో సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం రోజు ఉదయం 9 గంటలకే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ అధికారులు హైదరాబాదులో ఉన్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ ఆఫీస్ కు చేరుకొని నిర్విరామంగా రైడ్స్ కొనసాగించారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మైత్రి మూవీ మేకర్స్ భారీ ప్రాజెక్టులను తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అలాగే విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలతో ఈ సంస్థ సినిమాలను తెరపైకి తీసుకువస్తోంది. ఈ క్రమంలో పలు అనుమానాలతో ఐటి అధికారులు ఒక్కసారిగా ఈ సంస్థపై సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారుతుంది. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
అదే విధంగా ఈ సంస్థలో కొంతమంది ఎన్నారైలు కూడా పెట్టుబడులు పెట్టినట్లు టాక్ కూడా వస్తోంది. ఇక ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టి ఉండవచ్చు అని గుసగుసలు వినిపించాయి.
రీసెంట్ గా పూరి జగన్నాథ్ ప్రొడక్షన్ పై పలువురు రాజకీయ నాయకులు నల్ల డబ్బుతో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే తరహాలో కొన్ని ప్రొడక్షన్ హౌస్ లపై కూడా అనుమానాలు వస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి వివరణ వస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.