Begin typing your search above and press return to search.
మైత్రీ వారికి ఇది ఊహించని ఎదురు దెబ్బేనా?
By: Tupaki Desk | 14 Dec 2022 5:30 AM GMTటాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరకు వరుసగా క్రేజీ సినిమాలు నిర్మిస్తూ నిత్యం బిజీ బిజీగా వుంటున్న టాప్ ప్రొడక్షన్ కంపనీ మైత్రీ మూవీ మేకర్స్. వీరి చేతిలో ప్రస్తుతం తొమ్మిది క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయి. మెగాస్టార్ తో `వాల్తేరు వీరయ్య`ని నిర్మిస్తున్న మైత్రీవారు మరో సీనియర్ హీరో బాలకృష్ణతో `వీర సింహారెడ్డి`ని సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు భారీ సినిమాలు 2023 సంక్రాంతికి సై అంటే సై అంటూ సమరానికి సిద్ధమవుతున్నాయి.
ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో రూపొందిస్తున్న `ఖుషీ` చిత్రీకరణ దశలో వుంది. సమంత అనారోగ్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ గత కొన్ని నెలలుగా డిలే అవుతూ వస్తోంది. వన్స్ సామ్ సెట్టయితే ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ పట్టాలెక్కడానికి రెడీగా వుంది. నందమూరి కల్యాణ్ రామ్ తో `అమిగోస్`.. ఇది చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది..., అల్లు అర్జున్ తో చేయబోతున్న పాన్ ఇండియా సెన్సేషన్ `పుష్ప 2` ఇటీవలే మొదలైంది.
పవన్ కల్యాణ్ తో `ఉస్తాద్ భగత్ సింగ్`ని ఈ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఇవే కాకుండా ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, రామ్ చరణ్ - బుచ్చిబాబు ప్రాజెక్ట్ లైన్ లో వున్నాయి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న `మీటర్` మూవీకి వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. ఇలా దాదాపు పది సినిమాలని ఏక కాలంలో నిర్మిస్తూ బిజీ బిజీగా వున్న మైత్రీ వారు కొత్తగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించారు.
ఆపీస్ ని కూడా రిసెంట్ గా ఓపెన్ చేశారు. ఇంతలోనే ఈ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. మెగాస్టార్ `వాల్తేరు వీరయ్య`, బాలయ్య `వీర సింహారెడ్డి` సంక్రాంతికి రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరి కొన్ని సినిమాలు చిత్రీకరణ లో వుండగా మైత్రీ సంస్థలో ఐటీ దాడులు జరగడంతో మైత్రీ వర్గాలు కొంత ఒత్తిడికి గురవుతున్నారట. రెండు భారీ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ ఇలా జరగడం ఏంటని వాపోతున్నారట. లెక్కలు పక్కాగానే వున్నా ఉన్న ఫలంగా రైడ్ జరగడానికి కారణం ఏంటని ఆందోళనకు గురవుతున్నారట.
ఈ టైమ్ లో మైత్రీ వారిపై ఐటీ దాడులు జరగడం ఊహించని ఎదురు దెబ్బ అని, మెగాస్టార్ `వాల్తేరు వీరయ్య`, బాలయ్య `వీర సింహారెడ్డి` సంక్రాంతికి రిలీజ్ కి రెడీ అవుతూ భారీగా బిజినెస్ జరిగే సమయానికి ఇలాంటి సంఘటన జరగడం జీర్ణించుకోలేని పరిణామమని ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోందట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.