Begin typing your search above and press return to search.
శాతకర్ణి నిర్మాతలపై ఐటీ దాడులు..!
By: Tupaki Desk | 31 Jan 2017 10:26 AM GMTసంక్రాంతికి విడుదలైన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం అశేష ప్రజాదరణకు నోచుకున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఇది 100వ చిత్రం కావడం, ఇది తెలుగువారి చరిత్రకు సంబంధించిన అంశం కావడంతో ఈ చిత్రం అన్ని వర్గాలనూ ఆకట్టుకుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి నిర్మించారు. అయితే, అనూహ్యంగా మంగళవారం నాడు నిర్మాత ఆఫీస్ పై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
నిర్మాత రాజీవ్ రెడ్డితోపాటు నైజాం ప్రాంతానికి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి ఆఫీస్ పై కూడా ఐటీ దాడులు జరిగాయి. ముందుగా ఫిల్మ్ నగర్ లో ఉన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టెయిన్మెంట్ ఆఫీస్ పై దాడి చేశారు. ఆ తరువాత, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న శ్రేష్ట్ మూవీస్ కార్యాలయంలో కూడా ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు.
గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం జనవరి 12న విడుదలైంది. తెలుగువారి చరిత్రకు సంబంధించిన అంశంతో రూపొందిన చిత్రం కావడంతో... తెలంగాణ, ఆంధ్రా రాష్ట్ర ప్రభుత్వాలు వినోద పన్ను రాయితీ ఇచ్చాయి. పన్ను రాయితీ లభించడంతో నిర్మాతలు, పంపిణీదారులకు ఈ చిత్రం మంచి లాభాలనే ఆర్జించి పెట్టిందని అంటున్నారు!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/