Begin typing your search above and press return to search.
సమంత.. నయనతార.. విజయ్ లకు ఐటీ షాక్
By: Tupaki Desk | 30 Sept 2015 10:26 AM ISTసెలబ్రిటీలకు బుధవారం పొద్దున్నే షాక్ తగిలిన పరిస్థితి. తారా పథంలో తిరుగులేని విధంగా దూసుకెళుతున్న సినీ తారలు సమంత.. నయనతార.. తమిళ యువనటుడు విజయ్ ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించింది.
తిరువనంతపురం.. కొచ్చి.. చెన్నైలతో పాటు.. దేశ వ్యాప్తంగా వీరికి ఆస్తులున్న 32 ప్రాంతాల్లో ఆదాయపన్ను అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్.. చెన్నైలలోని సమంత.. నయనతార ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక.. విజయ్ బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. పేరుప్రఖ్యాతులున్న ముగ్గురు సినీతారల ఆస్తులపై తనిఖీలు జరపటం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సమాజ సేవ చేస్తూ.. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సమంత ఆస్తులపైనా అధికారులు దాడులు జరపటం విపరీతమైన చర్చకు తావిస్తోంది. ఈ ముగ్గురు తారల ఇళ్లపై ఐటీ శాఖాధికారులు జరుపుతున్న దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.