Begin typing your search above and press return to search.

వరుసగా మూడోరోజూ సోనూసూద్ ఇళ్లపై ఐటీ రైడ్స్

By:  Tupaki Desk   |   17 Sep 2021 12:53 PM GMT
వరుసగా మూడోరోజూ సోనూసూద్ ఇళ్లపై ఐటీ రైడ్స్
X
కరోనా లాక్ డౌన్ వేళ అందరికీ సహాయం చేసి రియల్ హీరో అయిన సోనూ సూద్ ఇళ్లు, కార్యాలయంతో సహా ఆయన ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు వరుసగా మూడోరోజు దాడులు కొనసాగిస్తున్నారు.  ఈ రైడ్స్ లో సోనూసూద్ వ్యక్తిగత ఫైనాన్స్ కు సంబంధించిన కేసులో పన్ను అవకతవకల గురించి ఐటీశాఖకు తెలిసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సినిమాల కోసం సోనూసూద్ తీసుకున్న డబ్బులో కూడా అక్రమాలు ఉన్నట్లు తెలిసిందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆ లావాదేవీలే కాకుండా సోనూసూద్ చారిటీ ఫౌండేషన్ ఖాతాపై కూడా ఆదాయపుపన్ను శాఖ దర్యాప్తు చేస్తోంది.

ఆదాయపు పన్ను అధికారులు ఈ  ముంబైలోని అతని ఇంటితోపాటు లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీతో సోనూ సూద్ ఆస్తి ఒప్పందంపై దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ అధికారులు నిన్న సోనూ సూద్ తో సంబంధం ఉన్న ఆరు ప్రదేశాలలో తనిఖీలు చేశారు. జుహులోని అతని ఇంటితోపాటు  అతని స్వచ్ఛంద సంస్థ కార్యాలయంతో సహా అన్నింటిలో తనిఖీలు చేశారు..

"సోనూ సూద్ కంపెనీ, లక్నో ఆధారిత రియల్ ఎస్టేట్ సంస్థ మధ్య ఇటీవలి ఒప్పందం పరిశీలనలో ఉంది. ఈ డీల్‌పై పన్ను ఎగవేత ఆరోపణలపై సర్వే చేశాం" అని ఐటీ  వర్గాలు పేర్కొన్నాయి.

ఈ దాడులు ఈరోజుతో ముగియవచ్చని.. తర్వాత విలేకరుల సమావేశం ద్వారా ఈ అంశానికి సంబంధించిన సమాచారాన్ని ైటీ అధికారులు అందరికీ తెలియజేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఐటీ అధికారులు సోనూ కుటుంబాన్ని, ఇంట్లో ఉన్న సిబ్బందిని కూడా విచారించారు. సోనూ ఇంటి నుంచి కొన్ని ఫైళ్లను తీసుకెళ్లారు. కరోనా లాక్ డౌన్ వేళ ‘సూద్ ఫౌండేషన్ ’ ద్వారా సోనూసూద్ చేసిన సాయాలపై కూడా ఐటీ అధికారులు పరిశోధిస్తున్నారు. సమాచారం ప్రకారం.. ఐటీ శాఖ ‘రియల్ ఎస్టేట్ డీల్ ను పరిశీలిస్తోందని సమాచారం.

ఒక నివేదిక ప్రకారం.. సోనూసూద్ మొత్తం నికల ఆస్తుల విలువ రూ.130 కోట్లు అని సమాచారం. సోనూ ప్రస్తుతం భార్య, పిల్లలతో ముంబైలో నివసిస్తున్నారు. అతడు హిందీతోపాటు దక్షిణాది, పంజాబీ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ నటుడిగా ఎదిగాడు. సోనూ ప్రతి సినిమాకు దాదపు రూ.2కోట్ల ఫీజు వసూలు చేస్తాడని టాక్.