Begin typing your search above and press return to search.
టాలీవుడ్ బడా నిర్మాతపై ఐటీ దాడులు?
By: Tupaki Desk | 8 Nov 2019 6:58 AM GMTటాలీవుడ్ లో మరో కలకలం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దుర్గా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ సినీ నిర్మాత కేఎల్ నారాయణ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలిసింది.
టాలీవుడ్ లో కేఎల్ నారాయణ ప్రముఖ నిర్మాతగా ఉన్నారు. ఆయన ఎన్నో హిట్ చిత్రాలను అందించారు. హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు, సంతోషం, రాఖీ, దొంగాట , క్షణక్షణం లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. కొద్దికాలంగా సినిమా నిర్మాణాలకు దూరంగా ఉంటున్నారు. ఆడపదడపా మాత్రమే సినిమాలు తీస్తున్నారు. ఆయనపై ఐటీ దాడులు టాలీవుడ్ లో కలకలం రేపాయి.
సినీ నిర్మాత కేఎల్ నారాయణ స్వగ్రామమైన కృష్ణ జిల్లా పెదగొన్నూరులోని ఆయన నివాసంలో గురువారం ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన సొంత ఇంటితోపాటు హైదరాబాద్, విజయవాడల్లోని నారాయణ నివాసాలు, కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు వార్తలొస్తున్నాయి.
నారాయణ సొంత ఇంట్లోనే కీలక పత్రాలు ఉన్నాయని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆయన స్వగ్రామం పెదగొన్నూరులో దాడులు చేయడానికి అదే కారణమని సమాచారం. పెదగొన్నూరులోని ఆయన ఇంట్లో ఉన్న రెండు బీరువాలు కీలకంగా ఉన్నాయని తెలిసింది. వాటిని తెరవడానికి కీ లేకపోవడంతో నిర్మాత కేఎల్ నారాయణకు సమాచారం అందించారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న కేఎల్ నారాయణ తన స్వగ్రామం చేరుకోగానే ఆయన ఇంట్లో ఉన్న రెండు బీరువాలను తెరుస్తామని ఐటీ అధికారులు చెబుతున్నారు.