Begin typing your search above and press return to search.
ఐటీ రైడ్స్: టాలీవుడ్ లో ఏం జరుగుతోంది?
By: Tupaki Desk | 24 Nov 2019 6:02 AM GMTటాలీవుడ్‌లో అసలేం జరుగుతోంది? అకస్మాత్తుగా టాలీవుడ్ సెలబ్రిటీలపై ఐటీ శాఖ దాడులకు దిగడం ఇండస్ట్రీ వర్గాల్లో కలవరం పుట్టించిన సంగతి తెలిసిందే. అసలేం జరుగుతోంది? అని ఆలోచించే లోగానే అంతా అయిపోయింది. అధికారులు వచ్చారు. తనిఖీలు చేశారు. కీలక పత్రాలు.. హార్డ్ డిస్క్ లు ఎత్తుకెళ్లి విచారణ పేరుతో ముప్పుతిప్పలు పెడుతున్నారు. కొందరికి సమన్లు జారీ చేసి విచారణ పేరుతో అట్టుడికిస్తున్నారు.
ఐటీ రైడ్స్ ప్రస్తుతం టాలీవుడ్ బడాబాబుల్ని ఒణికిస్తున్నాయని గుసుసలు వినిపిస్తున్నాయి. ఒక జాబితా అయ్యింది. రెండో జాబితాను అధికారులు చెక్ చేస్తున్నారట. దీంతో ఎంత జాగ్రత్తగా వున్నా ఎవరిపైన ఎప్పుడు ఐటీ దాడులు జరుగుతాయోనని అంతా భయపడుతున్నారు. తాజా దాడుల నేపథ్యంలో ఆఫీసుల్లో.. ఇళ్లల్లో కీలక పత్రాలతో పాటు భారీ మొత్తాన్ని దాచుకోవాలంటేనే భయపడుతున్నారట. ముఖ్యంగా కొందరైతే ఇళ్లల్లోనే వుండటం మానేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం జరిగినన దాడుల భయంతో ఇప్పటికే మిగతా వాళ్లంతా సైలెంట్ గా అంతా సర్దేసుకున్నారట.
హీరో వెంకటేష్.. నానిలపై ఐటీ దాడులు జరిగిన దగ్గరి నుంచి ఇతర హీరోలు కూడా ఐటీ విషయంలో జాగ్రత్త పడుతున్నారు. గతంలో కంటే డీమోనిటైజేషన్.. జీఎస్టీ పరిణామాల తరువాత ట్రాన్సక్షన్స్ కరెక్షన్ కి వచ్చినా ఇంకా ఏదో లొసుగు ఉందన్నది అధికారుల అనుమానం. దీనివల్లనే ఈ ఎటాక్స్ అని అంతా విశ్లేషిస్తున్నారు. పారితోషికాలుగా తీసుకునేది అంతా 70 శాతం వైట్ లోనే జరుగుతోంది. ఎక్కడా ఎలాంటి బ్లాక్ కు తావివ్వడం లేదు. అయితే మిగతా 30శాతంపైనే డౌట్స్ అని తెలుస్తోంది. సినిమాలకు సంబంధించిన లాభాల్లో హీరోలు వాటాల్ని మాత్రం నగదు రూపంలో కాకుండా ఏదైనా స్థిరాస్థి లేదా గోల్డ్ రూపంలో తీసుకుంటున్నారు. అది కూడా ఈ డీల్స్ విషయంలో బినామీలను ప్రయోగిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాన్ని బట్టి ఇక ఈ విషయంలోనూ ఇక నుంచి సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ ని భయాందోళనకు గురి చేస్తోందట. ఇటీవలి కాలంలో లాభాల్లో వాటాల వెనక కూడా ఐటీకి సంబంధించిన లాజిక్ ఏదో ఉందని ఈ సందర్భంగా అనుమానాలు మొదలయ్యాయి. మరి వీటన్నిటి వెనక మర్మం ఏమిటన్నది సామాన్యుడికి అస్సలు అర్థం కానిది. మరి ఐటీ అధికారులే నిజాలు నిగ్గు తేల్చి కామన్ జనాలకు అర్థమయ్యేలా తెలియజేస్తారేమో చూడాలి. తప్పు చేస్తే సెలబ్రిటీ అయినా.. కామన్ జనాలు అయినా ఒకటే అని నిరూపిస్తారా అన్నది చూడాలి.