Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ ఇంట మళ్లీ సోదాలు
By: Tupaki Desk | 12 March 2020 9:50 AM GMTతమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో మరియు ఆయన గత చిత్రం బిగిల్ నిర్మాత ఇంట్లో కొన్ని రోజుల క్రితం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు గుర్తించినట్లుగా వార్తలు వచ్చాయి. నిర్మాత అన్బుచెలియన్ తో పాటు విజయ్ వద్ద కూడా అక్రమాస్తులు ఉన్నట్లుగా ఐటీ అధికారులు నిర్థారణకు వచ్చారని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. ఆ సమయంలోనే రాజకీయంగా కూడా పెద్ద చర్చ జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ విజయ్ ను తొక్కేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ విజయ్ ఫ్యాన్స్ ఆరోపించారు.
ఆ విషయం గురించి ఇప్పుడిప్పుడే మర్చి పోతున్న సమయంలో మళ్లీ సోదాలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం విజయ్ ‘మాస్టర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు చెందిన లలిత్ కుమార్ ఇంట్లో రెండు రోజుల క్రితం సోదాలు నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ ఐటీ అధికారులు పణయూర్ ఇల్లంలోని విజయ్ ఇంటికి వెళ్లారట. అక్కడ మరోసారి సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా విజయ్ ను టార్గెట్ గా చేసి ఐటీ అధికారులు చేస్తున్న దాడులు ఖచ్చితంగా రాజకీయ కక్షతో అంటూ ఆయన ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. బీజేపీ వారి విధానాలను విజయ్ వ్యతిరేకిస్తున్న కారణంగానే ఆయన ఇంటిపై ఇలాంటి దాడులు చేయించి లొంగ దీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ తమిళనాడు లో ఒక వర్గం వారు బలంగా వాదనలు వినిపిస్తున్నారు. విజయ్ ఇంట సోదాలపై సినీ వర్గాల వారు కూడా విమర్శలు చేస్తున్నారు. విజయ్ ను టార్గెట్ చేయడం న్యాయం కాదంటున్నారు.