Begin typing your search above and press return to search.
సమంత చారిటీపైనే డౌట్
By: Tupaki Desk | 2 Oct 2015 11:30 AM GMTఅందాల సమంత .. ఎరక్కపోయి ఇరుక్కుపోయింది. అనవసరంగా చిక్కుల్లో పడింది. కారణం ఏదైనా ఈ అమ్మడు ఎదగడం ఇష్టం లేనివాళ్లే తనపై లేనిపోని ప్రచారం చేశారని ఇప్పుడు అర్థం చేసుకోవాల్సొస్తోంది. మొన్నటిరోజున ఐటీ రెయిడ్స్ లో సమంత ఓ టార్గెట్ అవ్వడానికి కారణమేంటి? అని ఆరాతీస్తే దిమ్మతిరిగే నిజాలే తెలుస్తున్నాయి. స్టార్ హీరో విజయ్ పై ఐటీ దాడులు జరగడానికి పలు కారణాలున్నాయి. విజయ్ ఐదేళ్లుగా ఐటీ క్లియరెన్స్ చేయడం లేదు. అలాగే అతడికి పొలిటికల్ గానూ రైవల్స్ ఉన్నారు. విజయ్ ని దెబ్బ కొట్టడం కోసం వాళ్లంతా కాచుక్కూచున్నారు. టైమ్ చూసి పులి చిత్రం పై పడ్డారు.
అదే తీరుగా అందాల నయనతార ఇటీవలి కాలంలో వరుసగా సినిమాల్లో నటిస్తూ హాట్ టాపిక్ అయ్యింది. వరుసగా నాలుగైదు సినిమాల్లో నటించేందుకు అగ్రిమెంట్లు కుదుర్చుకుంది. అంతేకాదు నయన్ నటిస్తోంది ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న నిర్మాత సినిమాలో. కాబట్టి తనపై ఇలా అధికార పక్షమే దాడి చేయించి ఉండొచ్చు. అయితే వీళ్ల సంగతి సరే .. సమంత లాంటి ఇన్నోసెన్స్ ఫేస్ పై ఇలా ఐటీ రెయిడ్ లు చేయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? అంటే సమంత ఇటీవలి కాలంలో ప్రత్యూష ఆర్గనైజేషన్ పేరుతో చారిటీ వ్యవహారాల్ని చక్కబెడుతోంది. రోగగ్రస్తులైన బాలలకు అవసరం అనుకున్నప్పుడు ఆర్థికంగా సాయం చేస్తోంది. తనకి ఇంతకుముందు వున్న కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఇలా వేరొకిరికి కష్టం కలగకూడదనే ప్రత్యూష సామాజిక సేవా సంస్థను ప్రారంభించాననని సమంత పలుమార్లు చెప్పుకొచ్చింది.
అయితే సమంత పైకి వేరే ఏదో కారణం చెబుతున్నా.. ఆదాయ పన్ను మినహాయింపుల కోసమే ఇలా స్వచ్ఛంద ముసుగు వేసిందని దాని ఫలితమే ఇటీవలి రెయిడ్స్ అని ప్రచారం సాగుతోంది. ఏది నిజం? ఏది అబద్ధం? అంతా పైవాడికే తెలియాలి. లేదా మన దర్శకుడు తేజకి అయినా తెలియాలి. అప్పట్లో తేజ చేసిన కామెంట్ ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి. ఈ సెలబ్రిటీలంతా ఐటీ మినహాయింపుల కోసమే ఇలా స్వచ్ఛంద సంస్థల్ని పెడుతున్నారని తేజ అన్నాడు. కాని సమంత విషయంలో మాత్రం ఆమె జెన్యూన్ గానే సేవలు చేస్తోందని అందరూ నమ్మతున్నారు.