Begin typing your search above and press return to search.

మహేష్ సినిమాలో ఐటెమ్ సాంగ్

By:  Tupaki Desk   |   26 Jun 2018 12:42 PM IST
మహేష్ సినిమాలో ఐటెమ్ సాంగ్
X
టాలీవుడ్ లో కమర్షియల్ సినిమా తెరకెక్కుతోంది అంటే అంటే అందులో ఐటెమ్ సాంగ్ తప్పకుండా ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎదో ఒక విధంగా దర్శకులు కథలో మంచి హైప్ క్రియేట్ చేయాలనీ ఐటెమ్ సాంగ్ ను సెట్ చేస్తారు. మాస్ ప్రేక్షకులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా సంగీత దర్శకులు కూడా స్పెషల్ పాటలను కంపోజ్ చేస్తారు. ఇప్పుడు మహేష్25 గ్యాంగ్ కూడా అదే తరహాలో ఆలోచిస్తోంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు - సి.అశ్విని దత్ ఆ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే మొన్నటి వరకు సినిమా కొన్ని కోర్టు ఇబ్బందులను ఎదుర్కోవడం వల్ల షూటింగ్ కి బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. కానీ ఫైనల్ గా దిల్ రాజు అన్ని క్లియర్ అయ్యేలా చూసుకొని షూటింగ్ స్పీడ్ పెంచేలా చేశారు. అయితే దర్శకుడు సెకండ్ హాఫ్ లో ఒక మంచి మసాలా ఐటెమ్ సాంగ్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సినిమాల్లో చాలా వరకు ఐటెమ్ సాంగ్స్ క్లిక్ అయ్యాయి.

పోకిరిలో - ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అనే పాట తెలుగు ఆడియెన్స్ కి ఐటెమ్ సాంగ్స్ ని బాగా అలవాటు చేసిందనే చెప్పాలి. ముమైత్ ఖాన్ కూడా ఒక్కసారిగా క్లిక్ అయిపొయింది. ఇక ఆ తరువాత కూడా మహేష్ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ బాగానే వచ్చాయి. ఇక ఇప్పుడు 25వ సినిమాలో స్టార్ హీరోయిన్ తో ఒక స్పెషల్ సాంగ్ ని రెడీ చేయాలనీ అనుకుతున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ సెట్ చేశాడని టాక్. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.