Begin typing your search above and press return to search.

సైరా భామల సరససల్లాపాలు

By:  Tupaki Desk   |   16 May 2019 2:30 PM GMT
సైరా భామల సరససల్లాపాలు
X
స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందుతున్న సైరా షూటింగ్ ఓ కొలిక్కి వస్తోంది. ఎప్పుడు పూర్తవుతుందనే ఖచ్చితమైన సమాచారం లేదు కానీ ఆగస్ట్ లోపే ఫైనల్ కావొచ్చని సమాచారం. ఇదిలా ఉండగా ఫ్రీడమ్ ఫైట్ నేపధ్యం కాబట్టి చిరు మార్కు రొమాన్స్ కానీ నయనతార గ్లామర్ కానీ చూసే అవకాశం లేదని ఆలోచిస్తున్న మాస్ ఫాన్స్ ని నిరాశపరచకుండా దర్శకుడు సురేందర్ రెడ్డి లీడ్ పెయిర్ మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ తో పాటు ఓ సాంగ్ ని షూట్ చేసే ప్లాన్ లో ఉన్నాడట.

అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఓ సెట్ లో వీటిని ప్రత్యేకంగా తీయబోతున్నట్టు తెలిసింది. సబ్జెక్టు సున్నితమైనది కావడంతో మరీ కమర్షియల్ సినిమా తరహాలో కాకుండా సున్నితమైన కెమిస్ట్రీని ఇద్దరి మధ్య చూపించబోతున్నారట.దీంతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా చిరుల మధ్య కూడా ఓ సాంగ్ వస్తుందట. సో రెండు డ్యూయెట్స్ అయితే ఉంటాయనే క్లారిటీ వచ్చేసినట్టే. ప్రస్తుతానికి విడుదల తేదీ అక్టోబర్ 2 అని వినిపిస్తోంది.

మెగా ఫాన్స్ అప్పుడే 139 రోజుల కౌంట్ డౌన్ అంటూ సోషల్ మీడియాలో హంగామా కూడా మొదలుపెట్టారు. చరణ్ ప్రకటిస్తే కానీ దాన్ని నమ్మడానికి లేదు. జగపతి బాబు-విజయ్ సేతుపతి- కిచ్చ సుదీప్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న సైరా మీద సుమారు రెండు వందల కోట్ల దాకా బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా. తెలుగు యోధుడి కథే అయినప్పటికీ పాన్ ఇండియా లెవెల్ లో దీన్ని ప్రెజెంట్ చేసేలా సూరి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడట