Begin typing your search above and press return to search.
మోడీ క్యారెక్టర్లో గ్రేట్ ఆర్టిస్ట్
By: Tupaki Desk | 8 April 2015 5:00 PM ISTపరేష్ రావల్ అన్న పేరు వినగానే నార్త్ నుంచి సౌత్ వరకు అందరికీ ఓ రకమైన గౌరవ భావం కలుగుతుంది. వెండితెర మీద అంత అద్భుతమైన పాత్రలు వేశారు, అంత గొప్పగా నటించారు మరి. పరేష్ రావల్ ఫ్రాణం పెట్టి చేసిన 'ఓ మై గాడ్' సినిమాలో ఆయన క్యారెక్టర్ చూస్తే ఎవరైనా అభిమానులుగా మారిపోవాల్సిందే. అంతగా ఆ పాత్రను పండించారాయన. ఇంకా పరేష్ రావల్ కెరీర్లో ఆణిముత్యాలనదగ్గ పాత్రలు చాలా ఉన్నాయి. ఇప్పుడాయన కెరీర్లో మరో ప్రతిష్టాత్మకమైన పాత్ర చేయబోతున్నారు. ఆ పాత్ర మరెవరిదో కాదు.. నరేంద్ర మోడీది.
ఇప్పటికే మోడీపై తనకున్న అభిమానాన్ని అనేకసార్లు చాటుకున్న రావల్.. మోడీ చలవతో బీజేపీ తరఫున మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా కూడా ఎన్నికయ్యాడు. ఆ వెంటనే మోడీ మీద సినిమా తీస్తానని చెప్పిన రావల్.. ఆ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయడంలేదు. సైలెంటుగా ఈ సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. మోడీ పాత్ర పోషించబోతుండటం మీద రావల్ మాట్లాడుతూ.. ''మోడీ సంకల్ప బలం, దార్శనికత, నాయకత్వ లక్షణాల్ని నా పాత్రలో ప్రతిబింబిస్తా. అంతే తప్ప మోడీని ఏమాత్రం ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించను'' అని చెప్పాడు.