Begin typing your search above and press return to search.

గీతా ఆర్ట్స్ లో సినిమా వ‌చ్చి ఆరేళ్ల‌వుతోందా?

By:  Tupaki Desk   |   3 Nov 2022 11:30 PM GMT
గీతా ఆర్ట్స్ లో సినిమా వ‌చ్చి ఆరేళ్ల‌వుతోందా?
X
గీతా ఆర్ట్స్ సంస్థ ని స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌ 1972లో స్థాపించారు. భ‌గ‌వ‌ద్గీత‌లోని గీత‌ని అనుస‌రించి ఈ ప్రొడ‌క్ష‌న్ హౌస్ కు పేరు పెట్టార‌ట‌. సినిమాల నిర్మాణం మొద‌లై తొలి సినిమా విడుద‌లైంది మాత్రం 1974లో. దర్శ‌క‌ర‌త్న డా. దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో చ‌లం, కృష్ణంరాజు, విజ‌య‌నిర్మ‌ల‌, శ్రీ‌విద్య ప్రధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం 'బంట్రోతు భార్య‌'. ఈ మూవీతో గీతా ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ గా మొద‌లైన ఈ సంస్థ దాదాపు నాలుగున్న‌ర ద‌శాబ్దాల‌కు పైగా చిత్ర నిర్మాణ రంగంలో వుంటూ వ‌స్తోంది.

'య‌మ కింక‌రుడు' మూవీ నుంచి మెగాస్టార్ చిరంజీవితో మాత్ర‌మే సినిమాలు నిర్మించ‌డం మొద‌లు పెట్టిన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ బ్యాన‌ర్ పేరుని కాస్త గీతా క్రియేటివ్ ఆర్ట్స్ గా మార్చేశారు. చిరంజీవి హీరోగా 1984లో వ‌చ్చిన 'హీరో' మూవీతో గీతా క్రియేటివ్ ఆర్ట్స్ కాస్త గీతా ఆర్ట్స్ గా మారింది. అక్క‌డి నుంచి అదే పేరుతో కంటిన్యూ అవుతూమెగా ఫ్యామిలీ హీరోల‌తో సినిమాలు నిర్మిస్తూ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాల్ని సొంతం చేసుకుంటూ వ‌స్తోంది.

గీతా ఆర్ట్స్ నుంచి సినిమా వ‌చ్చి దాదాపు రెండేళ్ల‌వుతోంది. ఈ బ్యాన‌ర్ లో అల్లు అర‌వింద్ నిర్మించిన మూవీ 'అల వైకుంఠ‌పురములో'. వ‌రుస ఫ్లాపుల‌తో గంద‌ర‌గోళ ప‌రిస్థితుల్లో వున్న‌ బ‌న్నీని మ‌ళ్లీ సక్సెస్ బాట ప‌ట్టించ‌డం కోసం అల్లు అర‌వింద్ చేసిన సినిమా ఇది.

హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ తో క‌లిసి గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన సినిమా ది. సోలోగా అయితే గీతా ఆర్ట్స్ నుంచి వ‌చ్చిన చివ‌రి సినిమా 'ధృవ‌'. రామ్ చ‌ర‌ణ్ తో ఆరేళ్ల క్రితం ఈ మూవీని నిర్మించారు అల్లు అర‌వింద్.

గీతా ఆర్ట్స్ లో సోలోగా సినిమా వ‌చ్చి ఆరేళ్లు అవుతున్నా ఇంత వ‌ర‌కు ఈ సంస్థ మ‌రో సినిమాకు సోలోగా శ్రీ‌కారం చుట్ట‌లేక‌నోయింది. దీనికి కార‌ణం ఏంటి? స‌ఒంత సంస్థ‌ని ప‌క్క‌న పెట్టి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ గీతా ఆర్ట్స్ 2 లో బ‌న్నీ వాసుతో క‌లిసి సినిమాలు నిర్మించ‌డానికి గ‌త కార‌ణం ఏంటీ? ఇంత‌కీ ఆయ‌న స్ట్రాట‌జీ ఏంటీ అన్న‌ది ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. పాన్ ఇండియా సినిమాల‌ని మాత్ర‌మే గీతా ఆర్ట్స్ లో తీయాల‌నుకుంటున్నారా? ..100 కోట్ల లోపు బ‌డ్జెట్ సినిమాల‌న్నీ గీతా ఆర్ట్స్ 2 లోనే చేస్తారా? ..

అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గీతా ఆర్ట్స్ 2 లోనూ పాన్ ఇండియా మూవీస్ తో పాటు రూ. 100 కోట్ల సినిమాల‌ని కూడా నిర్మిస్తున్నారు. కానీ గీతా ఆర్ట్స్ లో మాత్రం గ‌త ఆరేళ్లుగా ఒక్క‌టంటే ఒక్క సినిమాని కూడా నిర్మించ‌క‌పోవడం ఏంటి? అల్లు అర‌వింద్ గారి మైండ్ లో ఏం ర‌న్న‌వుతోంది? అన్న‌ది ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.