Begin typing your search above and press return to search.
రాజమౌళి కంటే ముందే షారూక్ భారతం
By: Tupaki Desk | 12 April 2017 8:22 AM GMTబాహుబలి2 మూవీ తర్వాత రాజమౌళి ఏ మూవీ చేస్తాడు? వెంటనే కాకపోయినా ఎప్పటికో అప్పటికి మహాభారతాన్ని తెరకెక్కిస్తానని జక్కన్న స్వయంగా చెప్పాడు. అయితే రాజమౌళి కంటే ముందే.. మహాభారతాన్ని మూవీగా మలిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించేశాడు షారూక్ ఖాన్.
తన సొంత నిర్మాణంలో భారతాన్ని మూవీగా తీయాలన్నది షారూక్ ఐడియా. అది కూడా బాహుబలికి మించిన భారీ బడ్జెట్ తీయాలని చూస్తున్నాడట. చాలామంది స్టార్లు సినిమాలు తీస్తున్నారు కానీ.. అవన్నీ లో బడ్జెట్ మూవీస్ మాత్రమే. ఆమిర్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. అనుష్క శర్మ.. ప్రియాంక చోప్రా.. ఇలా చాలామంది స్టార్లు లో బడ్జెట్ మూవీస్ తీసి.. తమ స్టార్ డం ఉపయోగించి డబ్బులు చేసుకుంటున్నారు. కానీ షారూక్ మాత్రం భారీ భారీ బడ్జెట్ తో భారతాన్ని సినిమాగా మలచాలని డిసైడ్ కావడమే కాదు.. ఇప్పటికే పనులు కూడా ప్రారంభించేశాడట. ఒకవైపు తను సినిమాలు చేస్తూనే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చక్కబెట్టేస్తున్నాడని అంటున్నారు.
మహా భారతం కోసం ఓ హాలీవుడ్ స్టూడియోను కో-ప్రొడక్షన్ కు తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇండియన్ ప్రొడ్యూసర్స్ ను ఈ విషయంలో పరిగణించే ఉద్దేశ్యం షారూక్ కి లేదని తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలోని పాత్రలకు సంబంధించి.. పలువురు స్టార్స్ తో చర్చలు కూడా సాగుతుండడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/