Begin typing your search above and press return to search.
టాలీవుడ్ మారాల్సిన టైం వచ్చింది
By: Tupaki Desk | 18 Jan 2018 6:41 AM GMTమనం టిఫిన్ చేయడానికి హోటల్ కి వెళ్ళినప్పుడు అధిక శాతం ఇష్టపడే ఐటమ్స్ కొన్ని ఉంటాయి. ఉదాహరణకు దోసా - వడ - పూరి - ఇడ్లి లాంటివి. ఇవి చేయటంలో చాలా ప్రాసెస్ ఉంటుంది. ముడి సరుకులు కూడా ఎక్కువ కావాలి కాబట్టి ధర కాస్త అధికంగా ఉంటుంది. అదే ఉప్మా లాంటి వాటిని తినే వారి శాతం మొదటి వాటితో పోలిస్తే తక్కువగా ఉంటుంది. చేసే విధానం కూడా వాటి కంటే చాలా సులభం కాబట్టి ధర కూడా తక్కువే. కాని ఉప్మా చాలా టేస్టీగా ఉండి మొదట చెప్పిన ఐటమ్స్ ఏ మాత్రం రుచి లేకుండా చప్పగా ఉన్నాయనుకోండి, అద్భుతంగా అనిపించిన ఉప్మాకే ఓటు వేసి ఆకలి తీర్చుకుని మనసారా మెచ్చుకుంటాం.
ఇదేమి ఉపమానం అని ఆశ్చర్యపోకండి. పూర్తిగా చదివాక మీకే క్లారిటీ వస్తుంది. టాలీవుడ్ లో సినిమాల పోకడ గురించి చెప్పాల్సి వచ్చింది కాబట్టి పైన ఉదాహరణ తీసుకున్నాం. అది ఎందుకో కూడా చూడండి. సాధారణంగా ఏ బాష సినిమా పరిశ్రమలో అయినా స్టార్ హీరోలు నటించిన భారీ కమర్షియల్ సినిమాలకు ఉన్నంత ఆదరణ - ఓపెనింగ్స్ చిన్న-మీడియం తరహా వాటికీ ఉండవు అనేది సహజం. కాని గత ఏడాది నుంచి ఇప్పటి సంక్రాంతిని పరిగణనలోకి తీసుకుంటే ఒకటి రెండు తప్ప మంచి విజయం సాధించి తమదైన ముద్ర వేసినవన్ని చిన్న తరహా సినిమాలే కావడం - అందులో వేటిలోనూ భారీ ఫాలోయింగ్ లేని హీరోలు ఉండటం భవిష్యత్ లో రాబోతున్న కొత్త ట్రెండ్ ని సూచిస్తోంది.
కలెక్షన్ పరంగానే కాదు కంటెంట్ పరంగానూ బాహుబలిని మినహాయించే మనం ఈ విశ్లేషణ చూడాలి. 2017లో ఖైది నెంబర్ 150 తప్ప అంత భారీగా కాసులు కురిపించిన సినిమా మరొకటి లేకపోవడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.కథల ఎంపిక పేరుతో ఏడాదికి ఒక్క సినిమా చేయటమే మహా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న హీరోలు అంతా చేసి చివరికి డిజాస్టర్ రూపంలో కొన్నవాళ్ళకు తీవ్ర నష్టాలు మిగుల్చుతున్నారు. మహేష్ బాబు స్పైడర్ విషయంలో జరిగింది అదే. బ్రహ్మోత్సవం తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని వచ్చినా ప్రయోజనం కలగలేదు. జూనియర్ ఎన్టీఆర్ జైలవకుశ కొన్ని చోట్ల నష్టాలే చూపించింది. ఎన్టీఆర్ మూడు పాత్రలను దర్శకుడు సరిగా డీల్ చేయలేకపోవడం ఫలితం మీద ప్రభావం చూపించింది. అల్లు అర్జున్ డిజే వారం లోపే వంద కోట్లు తెచ్చింది అని చేసుకున్న ప్రచారం పోస్టర్లకే పరిమితమయ్యింది తప్ప వాస్తవంగా జరిగింది వేరు. పవన్ కళ్యాణ్ కాటమరాయుడి ప్రతాపం వారం రోజులకే చూపించి తర్వాత నష్టాలు ఇచ్చే విషయంలో రాజీ పడలేదు.
కాని రిమార్కబుల్ మూవీస్ గా మెప్పులు పొందటమే కాదు టికెట్ కౌంటర్ల దగ్గర కాసులు కూడా కురిపించిన అర్జున్ రెడ్డి - ఘాజీ - శతమానం భవతి - నిన్ను కోరి - ఫిదా - ఆనందో బ్రహ్మ - ఇవన్ని చాలా తక్కువ పెట్టుబడిలో రూపొంది బయ్యర్లకు అంతకంతా లాభాలు తెచ్చిన సినిమాలు. వీటిలో దేని బడ్జెట్ 15 కోట్లు దాటలేదు అనేది అబద్దం కాదు. ఇలాంటి వాటి వల్ల సేఫ్ గా బయట పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలా కాదని కేవలం స్టార్ పవర్ - కాంబినేషన్ క్రేజ్ ని మాత్రమే నమ్ముకుని సినిమా తీస్తే ప్రేక్షకులు మొహమాటం లేకుండా తిరస్కరిస్తారని మొన్న వచ్చిన అజ్ఞాతవాసి కూడా ఋజువు చేసింది. కొనుగోలుదారులు కూడా నిర్మాతనో లేక హీరోనో బాగుంటే చాలు అన్ని సినిమాలు కొనడం లేదు. ఇది వ్యాపారం. తనకు అంతకంతా లాభాలు వస్తాయి అంటేనే ఎవడైనా సినిమా కొంటాడు. ఇది నన్ను నిలువునా ముంచేలా ఉంది అన్న అనుమానం వచ్చినప్పుడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా వద్దు అని దండం పెట్టుకుని దాని బదులు ఓ పది చిన్న సినిమాలు కొంటె వాటిలో ఐదు సక్సెస్ అయినా తలెత్తుకు తిరగవచ్చు అనే ధీమాలో ఉంటాడు. ఇప్పుడున్న ట్రెండ్ ఇలాగే కొనసాగితే మటుకు ఆలాంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు.
పైన చెప్పిన ఉపమానం ఇప్పుడు లింక్ చేసి చూడండి. ఆకలి వేసిన వాడికి తన ఆకలి తీరడం - పెట్టిన డబ్బుకు తగ్గ నాణ్యమైన తిండి లభించడం ముఖ్యం. అది తనకు ఇష్టమైన దానిలో దొరకనప్పుడు బాగున్న దానినే తన ఇష్టంగా మార్చుకుని సంతృప్తి పడతాడు. అది మన తినే టిఫిన్ అయినా సినిమా అయినా ఒకటే సూత్రం వర్తిస్తుంది. ఇది గుర్తించి కథల మీద కథనాల మీద దర్శకులు - హీరోలు శ్రద్ధ వహించకపోతే సినిమా ప్రివ్యూలు చూపించి దానికి రేట్ డిసైడ్ చేసే రోజులు మళ్ళి వచ్చినా రావొచ్చు.