Begin typing your search above and press return to search.
'RRR చిత్రాన్ని నామినేట్ చేయకపోవడం అన్యాయం'
By: Tupaki Desk | 22 Sep 2022 8:16 AM GMTదర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ''ఆర్.ఆర్ఆర్'' చిత్రాన్ని భారతదేశం తరపున ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్లకు పంపకపోవడంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రజాదరణ పొందిన చిత్రాన్ని కాకుండా.. 'ఛెల్లో షో' అనే గుజరాతీ సినిమాని ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా సినీ దర్శకుడు, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వై. కాశీ విశ్వనాథ్ కూడా దీనిపై స్పందించారు. "ఆర్ఆర్ఆర్" సినిమాని ఆస్కార్ కి నామినేట్ చేయకపోవడం అన్యాయమని అన్నారు. గుజరాతీ సినిమాను నామినేట్ చేసి.. దేశ ఖ్యాతిని ఇనుమడింప జేసే తెలుగు చిత్రాన్ని పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
"ఒక దేశభక్తిని చాటి చెప్పే చిత్రాలు ఎన్నో వచ్చాయి. ఫిక్షన్ యాంగిల్ లో కల్పిత కథతో.. ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు వెచ్చించి అద్భుతంగా తెరకెక్కించిన సినిమా "ఆర్.ఆర్.ఆర్". 'కంటెంట్' పరంగా గాని.. 'సందేశం' పరంగా గాని.. దేశ ఖ్యాతిని ఇనుమడింప జేసే సినిమా. RRR చిత్రీకరణలో 'సీన్స్' రక్తి కట్టించడంలో గాని.. నటీనటుల నుంచి పెరఫార్మెన్స్ రాబట్టుకోవడంలో గాని.. దర్శకులు రాజమౌళి గారు ప్రాణం పెట్టి పని చేశారు"
"హీరోలు జూ. ఎన్టీఆర్ గారు గానీ.. రామ్ చరణ్ గాని తమ పాత్రలలో జీవించారు. టెక్నీషియన్స్ ప్రతిభ అమోఘం. అలాంటి సినిమాని ఆస్కార్ కి నామినేట్ చేయకుండా.. 'చెల్లో షో' అనే గుజరాతీ సినిమాను నామినేట్ చేయడం.. తెలుగు చిత్రాన్ని పట్టించుకోకపోవడం శోచనీయం. దీన్ని ఖండిస్తూ తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా నా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాను" అని కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు.
ఇకపోతే ఆస్కార్ నామినేషన్ కోసం 'RRR' ను కాదని 'ఛల్లో షో' సినిమాని ఎంపిక చేయడంపై ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీపై దర్శకుడు ఎన్. శంకర్ కూడా తన నిరాశను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 'ఛల్లో షో' ని ఏ కోణంలో నామినేట్ చేశారో తెలియదు కానీ.. ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని ఎంపిక చేయకపోవడం బాధ కలిగించిందని దర్శకుడు సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో రూపొందించిన RRR చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్ కు నామినేట్ చేస్తారని అందరూ భావించారు. అంతర్జాతీయ మ్యాగజైన్స్ కూడా ఈ సినిమా పలు విభాగాల్లో నామినేట్ అయ్యే అవకాశం ఉందని తెలిపాయి.
కానీ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం 'చెల్లో షో' అనే గుజరాతీ చిత్రాన్ని ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం క్యాటగిరీలో ఎంపిక చేసినట్లు ప్రకటించింది. దీంతో టాలీవుడ్ సినీ ప్రియులు మరియు RRR అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నిరసన తెలుపుతున్నారు. ఎన్. శంకర్ - కాశీ విశ్వనాథ్ వంటి టాలీవుడ్ ప్రముఖులు కూడా ఇప్పుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.