Begin typing your search above and press return to search.

రొమేనియన్ భామని 'మిసెస్' అనేస్తున్నారా?

By:  Tupaki Desk   |   17 Aug 2016 5:02 AM GMT
రొమేనియన్ భామని మిసెస్ అనేస్తున్నారా?
X
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు ఎఫైర్లు కొత్తేమీ కాదు. తనతో పాటు నటించినవాళ్లలో చాలామందితో సల్మాన్ పేరు వార్తల్లో నానింది. సల్లూభాయ్ చెయ్యి పడ్డాక బోలెడంత మంది టాప్ హీరోయిన్స్ అయిపోయి స్టార్లుగా మారిపోయారు. అయితే సల్మాన్ మాత్రం ఇంకా ఒంటరిగానే మిగిలిపోయాడు. ఈ ఒంటరి తనానికి ఇరానియన్ సుందరి లూలియా వంతూర్ తో చెక్ పెట్టేసినట్లే అనే టాక్ ఎక్కువగానే ఉంది.

సల్మాన్-లూలియాల విషయంలో ఇండియన్ మీడియా ఇంకా మొహమాట పడుతోంది కానీ.. రొమేనియన్ మీడియా మాత్రం ఇప్పటికే వీళ్లిద్దరినీ మొగుడూ పెళ్లాలు అంటూ కన్ఫామ్ చేసేసింది. లూలియాను ప్రస్తావిస్తూ.. ఓ మీడియా "డోమ్నా ఖాన్" అంటూ అడ్రస్ చేసింది. దీనికి 'రాయల్ మిసెస్ ఖాన్' అని అర్ధం. మిసెస్ ఖాన్ అనగానే అసలు విషయం అర్ధమైపోతోంది కదా. సల్మాన్ కి కూడా ఈమెకు గురించిన విషయాల్లో దాపరికం పాటిస్తున్నట్లుగా పెద్దగా కనిపించడం లేదు.

తాజాగా దలైలామా దగ్గరకు లూలియా సల్మాన్ లు కలిసి వెళ్లిన సంగతి తెలిసింది. ఇక ట్యూబ్ లైట్ షూటింగ్ కోసం సల్మాన్ లెహ్ కు వెళితే.. అక్కడ ప్రత్యక్షమైపోయింది లూలియా. రీసెంట్ గా ఓ పెయింటింగ్ ని షేర్ చేసిన ఈ భామ.. పెయింటర్ పేరు చెప్పలేదు కానీ.. సిగ్నేచర్ లో ఖాన్ సంతకం కనపడిపోతోంది. మలైకా అరోరాతో కలిసి కనిపించడం మరో వార్త అయితే.. సల్మాన్ సన్నిహితులందరికీ ఇప్పటికే ఈమె వదిన అయిపోయిందట కూడా.