Begin typing your search above and press return to search.
నన్నెవరు సంప్రదించలేదు.. నేను ఎలా చేస్తా?
By: Tupaki Desk | 5 Feb 2019 6:46 AM GMTమిస్టర్ మజ్ను చిత్రంలో అఖిల్ తో కొద్ది సమయం రొమాన్స్ చేసి అలరించిన బ్రెజిల్ ముద్దుగుమ్మ ఇజాబెల్లే టాలీవుడ్ లో వరుస చిత్రాలను చేసేందుకు ఆసక్తిగా ఉంది. త్వరలో ఈమె విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సినిమాలో కూడా ఈమెది గెస్ట్ రోల్ లాగే ఉంటుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో ప్రముఖ సీనియర్ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నరేంద్ర' సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
నీలేష్ హీరోగా రూపొందుతున్న 'నరేంద్ర' సినిమాలో ఇంటర్నేషనల్ బాక్సర్ ఖలీ కీలక పాత్రలో పోషించబోతున్నాడు. విభిన్నమైన నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విదేశీ బ్యూటీ హీరోయిన్ అయితే బాగుంటుందని, అందుకే ఇజాబెల్లేను జయంత్ సి పరాన్జీ ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే గత కొన్ని రోజులుగా తన గురించి మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లే అని - తాను నరేంద్ర సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చేసింది ఈ బ్రెజిల్ ముద్దుగుమ్మ.
'నరేంద్ర' సినిమాలో నేను నటించడం లేదు, అసలు నన్ను ఇప్పటి వరకు ఆ సినిమా కోసం ఎవరు సంప్రదించలేదు. నన్ను సంప్రదించకుండానే నేను ఆ సినిమాలో ఎలా చేస్తానంటోంది. ప్రస్తుతం కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే వాటిని ఫైనలైజ్ చేస్తానంది. మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈమె వెయిట్ చేస్తుందట.