Begin typing your search above and press return to search.
అలా దాసరిగారిపై పగ తీర్చుకున్నాను: జేడీ చక్రవర్తి
By: Tupaki Desk | 13 Nov 2021 4:18 AM GMTతెలుగు తెరకు ఎన్నో విభిన్నమైన కథలను . విజయాలను పరిచయం చేసిన దర్శకులు దాసరి నారాయణరావు. చనిపోయేంతవరకూ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఎంతోమంది తమకి ఎలాంటి అవసరం వచ్చినా .. ఆపద వచ్చిన ఆయన ఇంటి తలుపు తట్టేవారని చెబుతుంటారు. అలాంటి దాసరి నారాయణరావు గురించి 'చక్రిభ్రమణం' కార్యక్రమంలో క్రితం ఎపిసోడ్లో జేడీ చక్రవర్తి చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యచకితులను చేశాయి. దాసరి నారాయణరావు అంటే తనకి ఎందుకు అంత కోపం అనే విషయాన్ని ఆ తరువాత ఎపిసోడ్ లో జేడీ చెప్పాడు.
"ముందుగా అనుకున్న ప్రకారం నేను దాసరి గారి షూటింగుకు వెళ్లలేదు. నేను వెళ్లకపోవడం వలన షూటింగు అంతా డిస్టబ్ అయిందని తెలిసి .. దాసరిగారు టెన్షన్ పడ్డారని తెలిసి ఎంజాయ్ చేశాను. నేను అలా చేయడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలంటే 'ఫ్లాష్ బ్యాక్' లోకి వెళ్లాలి. " మా నాన్నగారి పేరు సూర్యనారాయణరావు .. ఆయనను అంతా 'రాజా' అని పిలిచేవారు. నేను పుట్టకముందు నుంచే మా నాన్నగారు .. దాసరి నారాయణరావుగారు మంచి స్నేహితులు. మావాళ్లు చెబితే నాకు ఈ విషయాలు తెలిశాయి. దాసరిగారు స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు .. ఆయన పద్మగారితో లవ్ లో ఉన్నప్పుడు .. మా నాన్నగారే వాళ్ల పెళ్లికి హెల్ప్ చేశారు. అప్పుడు ఆమె 'చాదర్ ఘాట్' లో హిందీ టీచర్ గా చేసేవారు.
దాసరిగారు సినిమాల్లోకి రావడానికి ముందు మా నాన్నగారు అన్ని రకాలుగా ఆయనను ఆదుకున్నారు. పెళ్లి తరువాత దాసరి గారు .. పద్మగారు కొంతకాలం పాటు మా ఇంట్లోనే ఉన్నారు. దాసరిగారి సినిమాల్లోకి వెళ్లిన కొత్తలో కూడా ఆర్ధికంగా నాన్నగారే హెల్ప్ చేశారు. దాసరి గారు దర్శకుడిగా నెమ్మదిగా పుంజుకోవడం మొదలు పెట్టారు. ఆయన పెద్ద డైరెక్టరై మద్రాసులో ఎన్టీఆర్ ఇంటి ఎదురుగా తాను ఇల్లు కట్టుకున్నారు. నాకు అప్పుడు పది .. పదకొండేళ్లు ఉంటాయి. మా నాన్నగారు మమ్మల్ని తీసుకుని వాళ్ల ఇంటికి వెళ్లారు. అప్పుడు ఉదయం 9:30 .. 10:00 అవుతోంది.
దాసరిగారు సిట్టింగులో ఉన్నారని చెబితే వెయిట్ చేయడం మొదలుపెట్టాము. ''భోంచేసి వెళ్లవలసిందే ..'' అని పద్మగారు పట్టుబడుతున్నారు. "లేదమ్మా మేము వెళ్లిపోతాము" అంటారు నాన్నగారు. అలా వాళ్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు. వెళ్తాను .. ఉంటాను .. వెళ్తాను .. ఉంటాను దగ్గరే చాలా సమయం గడిచిపోయింది. మధ్యాహ్నం అయినా దాసరి గారు మాత్రం బయటికి రావడం లేదు. పద్మగారు చాలా ఫీలవుతున్నారు. "లేదమ్మా మేము వెళతాము .. ఒకసారి నారాయణరావుకి ఒక మాట చెప్పేసి వెళతాము" అనేసి నాన్నగారు ఆయన రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేశారు.
దాసరిగారు టప్ మని వెనక్కి తిరుగుతూ ''రాజా వాళ్లు వెళ్లిపోయారా?" అని అన్నారు. డోర్ తీసింది తన అసిస్టెంట్ అనుకుని. లోపల రూమ్ లో ఎవరూ లేరు .. ఆయన ఒక్కరే ఉన్నారు. మా నాన్నగారు షాక్ అయ్యారు. అవమానంతో ఆయన అలా నుంచుడి పోయారు. ఆయనకంటే 100 రెట్లు షాక్ లో దాసరిగారు ఉన్నారు. ఆయన అలాగే నుంచుండి పోయారు. మా నాన్నగారు చకచకా అక్కడి నుంచి నడచుకుంటూ వెళ్లిపోయారు. పద్మగారు నాన్నకి ఏదో సర్ది చెప్పబోయారు. నాన్నగారు మాత్రం అవేమీ వినిపించుకోలేదు.
కారు వెళుతోంది .. "నారాయణరావు ఎందుకు ఇలా చేశారు .. నేనేమీ ఫేవర్ అడగలేదు .. ఇచ్చిన డబ్బులు వెనక్కి అడగలేదే .. ఇష్టం లేకపోతే చెప్పేయవచ్చుగదా .." అని నాన్నగారు అన్నారు. ఆయన అంత హర్ట్ కావడం .. ఆ బాధతో మా ముందే సిగరెట్ తాగడం ఫస్టు టైమ్ చూశాము. మా నాన్నని అంతగా హర్ట్ చేసిన ఆయనను రాయి పెట్టి కొడదామా అనిపించింది. ఆయనను ఏదో ఒకటి చేయాలి .. ఏం చేయాలి? అనే ఒక ఆలోచనతో నాకు తెలియకుండానే ఆయనపై కసి పెంచుకున్నాను. ఎప్పటికైనా ఆయనపై పగ తీర్చుకోవాలని నేను డిసైడైపోయాను. అందువల్లనే షూటింగుకు వస్తానని చెప్పి చివరి నిమిషంలో వెళ్లకుండా ఎగ్గొట్టాను " అని చెప్పుకొచ్చాడు.