Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: రాజుగారికి క‌రోనా పాఠం

By:  Tupaki Desk   |   4 April 2020 4:30 AM GMT
టాప్ స్టోరి: రాజుగారికి క‌రోనా పాఠం
X
రాజుగారికి రీమేక్ లు.. అనువాద సినిమాలు పెద్ద‌గా క‌లిసి రావ‌డం లేదు. భారీ మొత్తాల్ని వెచ్చించి రైట్స్ ద‌క్కించుకుని రీమేక్ చేస్తున్నా ఇక్క‌డ అంచ‌నాలను అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాయి. ఇటీవ‌లే 96 రీమేక్ రిజ‌ల్ట్ గురించి తెలిసిందే. ఈ సినిమాని `జాను` టైటిల్ తో శ‌ర్వానంద్...స‌మంత జంట‌గా రీమేక్ చేస్తే అది ఘోరంగా దెబ్బ కొట్టింది. రాజుగారు ఈ సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నా ప‌న‌వ్వ‌లేదు. దీంతో కాస్త నిరుత్సాహం త‌ప్ప‌లేదు. తాజాగా క‌రోనా లాక్ డౌన్ మైండ్ సెట్లు మార్చేస్తోంది. అందుకే ఇప్పుడాయ‌న రీమేక్ ల నిర్ణ‌యాన్ని విర‌మించుకున్నార‌న్న ప్ర‌చారం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. బాలీవుడ్ హిట్ మూవీ `బ‌దాయి హో` రీమేక్ రైట్స్ ను రాజుగారు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే.

ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టించిన సినిమా అవార్డులు రివార్డుల‌ను సైతం సొంతం చేసుకుంది. దీంతో రాజుగారు ఎంతో ఇష్ట‌ప‌డి భారీగా వెచ్చించి తెలుగు రీమేక్స్ రైట్స్ తీసుకున్నారు. అక్కినేని నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేసారు. రాజుగారు ఈ విష‌యాన్ని చై దృష్టికి తీసుకెళ్ల‌డం..అత‌ను గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అయితే తాజాగా చైతూ ఆ రీమేక్ పై ఆస‌క్తి చూపించ‌డం లేదుట‌. దీనికి తోడు రాజుగారికి ఇటీవ‌లే జాను రూపంలో త‌గిలిన దెబ్బ వ‌ల్ల‌నా పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారుట‌.

రీమేక్ లు క‌లిసి రావ‌డం లేద‌ని స్ట్రెయిట్ స్టోరీలే కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం దిల్ రాజు ఈ రీమేక్ ని ప‌క్క‌న‌బెట్టి తెలుగు స్క్రిప్ట్ ల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారుట‌. బ‌దాయి హో కి స‌రైన హీరో దొరికితే అప్పుడు చూసుకుందామ‌ని...ప్ర‌స్తుతానికైతే రీమేక్ ఆలోచ‌న విరమించాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ప్ర‌స్తుతం దిల్ రాజు వేర్వేరు ప్రాజెక్ట్ లతో బీజీగా ఉన్నారు. బాలీవుడ్ లో అల్లు అర‌వింద్ తో క‌లిసి జెర్సీ రీమేక్ ని సుషాంత్ సింగ్ రాజ్ పుత్ తో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక‌పోతే ప్ర‌స్తుతం క‌రోనా అంద‌రికీ పాఠాలు నేర్పిస్తోంది. ఆ కోవ‌లోనే క‌రోనా లాక్ డౌన్ రాజుగారికి గట్టి పాఠాలు నేర్పిస్తోంద‌న్న గుస‌గుస ఇన్ సైడ్ స‌ర్కిల్స్ లో వేడెక్కిస్తోంది.