Begin typing your search above and press return to search.
‘జాతిరత్నాలు’ జోరులో కొట్టుకుపోయిన ‘ఉప్పెన’.. నెం.1 సినిమాగా రికార్డు..!
By: Tupaki Desk | 26 March 2021 6:06 AM GMTసినిమా ద్వారా ఏం చెప్పినా.. ఎలా చెప్పినా.. ప్రేక్షకుడికి అంతిమంగా కావాల్సింది వినోదం. అది ఏ రేంజ్ లో అందిస్తే.. ఆడియన్స్ అంతగా ఎగబడతారు. ‘జాతిరత్నాలు’ సినిమా ద్వారా పుష్కలమైన ఫన్ అందించారు మేకర్స్. అంతే.. లాక్ డౌన్ దూరంచేసిన హ్యూమర్ మొత్తాన్ని ఈ సినిమాతో కవర్ చేసుకుంటున్నారు ప్రేక్షకులు. విడుదలైన మూడో వారంలో దుమ్ములేపే కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో నెంబర్ 1 సినిమాగా నిలిచింది.
పేరు, టీజర్, ట్రైలర్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. అద్దిరిపోయే కామెడీతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఈ మౌత్ టాక్ బీభత్సంగా స్ప్రెడ్ అయిపోవడంతో జనాలు థియేటర్ కు క్యూకట్టడం మొదలు పెట్టారు. రెండు చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ విజేతగా నిలిచిన ఈ సినిమా.. ఆ తర్వాతి వారంలోనూ సత్తా చాటింది.
రెండో వారంలో మొత్తం నాలుగు కొత్త సినిమాలు వచ్చాయి. అందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో జాతిరత్నాలు జోరు కొనసాగింది. కలెక్షన్ల పంట పండింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా.. ఆ తర్వాత నుంచీ లాభాలు పోగేసుకోవడం మొదలు పెట్టింది.
సినిమా విడుదలైన రెండు వారాల్లో 49.15 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన సినిమా.. 30.75 కోట్ల షేర్ రాబట్టింది. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో జోరు ఇలా ఉంటే.. ఓవర్సీస్ లో జెండా ఎగరేసింది. అక్కడ ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. కరోనా లాక్ డౌన్ తర్వా విదేశాల్లో మిలియన్ డాలర్లు రాబట్టిన మొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ విధంగా జాతిరత్నాలు.. కలెక్షన్ల రాసులు పోగేయడంతో యూనిట్ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది.