Begin typing your search above and press return to search.

డిజిటల్ రైట్స్ పరంగా 'జాతిరత్నాల'కు చుక్కెదురైందా..??

By:  Tupaki Desk   |   26 March 2021 2:30 AM GMT
డిజిటల్ రైట్స్ పరంగా జాతిరత్నాలకు చుక్కెదురైందా..??
X
సినీ పరిశ్రమలో లాక్డౌన్ తర్వాత ప్రతి శుక్రవారం పెద్దసంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇదివరకు అంటే వారానికి ఒకటి రెండు విడుదలయ్యే సినిమాలు ఇప్పుడు రోజులు మారిపోయే సరికి వారానికి నాలుగు సినిమాల పైనే విడుదల అవుతుండటం గమనార్హం. అసలు విషయం ఏంటంటే.. ఈరోజుల్లో సినిమా ఫలితాలు ఒక్కరోజులోనే ఓ కొలిక్కి వస్తున్నాయి. ఏ సినిమాకైనా మొదటివారం చాలా ముఖ్యమైనది. అది చిన్నసినిమా కావచ్చు లేదా బడా సినిమా కావచ్చు. ఆ వారంలో ఎంత కలెక్ట్ చేసాయో పక్కనపెడితే వారాంతం ముగిసే సమయానికి ఎలా ఉన్నాయనేది చూస్తున్నారు. అయితే మొదటి నుండి మంచి కలెక్షన్స్ రాబట్టిన జాతిరత్నాలు సినిమా మొత్తంగా ఆ వారం ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయస్ అయింది.

అయితే నిజానికి జాతిరత్నాలు సినిమా థియేట్రికల్ రిలీజ్ అయ్యేది కాదట. ఫేమస్ ఓటిటి అమెజాన్ ప్రైమ్ ఆల్రెడీ లాక్డౌన్ సమయంలోనే 18 కోట్లవరకు ఆఫర్ చేసిందట. అమెజాన్ వారు సినిమా చూసి పక్కా ఆడుతుందని నిర్ణయానికి వచ్చాకే వైజయంతి మూవీస్ వారికీ భారీ ధరనే ఆఫర్ చేసిందట. తీరా లాక్డౌన్ ముగిసాక విడుదలైన సినిమాలు కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించేసరికి జాతిరత్నాలు మేకర్స్ అమెజాన్ ప్రైమ్ ఓటిటి రిలీజ్ కాన్సల్ చేసుకున్నారు. కానీ డిజిటల్ రైట్స్ మాత్రం అమెజాన్ వారికే ఇచ్చేసారు చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమా యూఎస్ లో మిలియన్ డాలర్స్ మార్క్ దాటింది. ఇప్పటివరకు సినిమా 22కోట్ల పైనే వసూల్ చేసిందట. కానీ డిజిటల్ రైట్స్ మాత్రం 6కోట్లకే అమ్ముడైనట్లు సమాచారం. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించగా.. రాహుల్, దర్శి కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించాడు.