Begin typing your search above and press return to search.
తమన్నా ప్లేస్ ను భర్తీ చేసిన జబర్దస్త్ యాంకర్
By: Tupaki Desk | 4 Oct 2021 11:30 AM GMTమిల్కీ బ్యూటీ తమన్నా హోస్ట్ గా మొదటి సారి చేసిన షో మాస్టర్ చెఫ్. జెమిని టీవీ ఈ షో ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించడం జరిగింది. తమన్నాకు భారీ పారితోషికం ఇవ్వడంతో పాటు జడ్జ్ లకు పెద్ద మొత్తంలో పారితోషికాలు ఇస్తూ షో ను భారీ ఎత్తున నిర్వహించారు. షో ను వారంలో రెండు రోజులు టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు. మొదటి రెండు వారాల పాటు మాస్టర్ చెఫ్ కు కాస్త గౌరవ ప్రథమైన రేటింగ్ వచ్చింది. కాని ఆ తర్వాత నుండి రేటింగ్ దారుణంగా పడిపోయింది. షో కు రేటింగ్ పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. అయినా కూడా ప్రయోజనం దక్కలేదట. పెట్టిన పెట్టుబడికి కనీసం సగం కూడా వచ్చే అవకాశాలు లేకుండా పోవడంతో ఇక చేసేది లేక తమన్నా ను షో నుండి తప్పించారనే వార్తలు వస్తున్నాయి.
ఆమె పారితోషికం భారీ మొత్తంలో ఉండటం వల్ల ఆమెకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ చిత్రీకరణ ముగించి తదుపరి ఎపిసోడ్స్ కు గాను జబర్దస్త్ యాంకర్ అనసూయను రంగంలోకి దించడం జరిగింది. మాస్టర్ చెఫ్ హోస్ట్ మారడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. తమన్నా ప్లేస్ ను అనసూయ భర్తీ చేసింది అంటే పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. షో యూనిట్ సభ్యులు మాత్రం తమన్నా కాల్షీట్లు లేని కారణంగా చివరి ఎపిసోడ్స్ ను అనసూయతో చేయిస్తున్నామని చెబుతున్నారు. కాని అసలు విషయం ఆమె షెడ్యూల్స్ ప్రకారం పారితోషికంను తీసుకుంటుంది. ఇటీవల ప్రసారం అయిన ఎపిసోడ్స్ తో ఆమె షెడ్యూల్ షూటింగ్ ముగిసింది. మళ్లీ కొత్త షెడ్యూల్ వేసి చిత్రీకరణ చేయాలంటే ఆమెను ఆహ్వానించాలి. అందుకు భారీగా పారితోషికం కావాల్సి వస్తుంది. అందులో కొద్ది మొత్తంకే అనసూయ వచ్చేస్తుంది కనుక ఈ మార్పు జరిగింది అనేది జెమిని వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసి జెమిని వారు మాస్టర్ చెఫ్ ను ప్రారంభించారు. ఇతర భాషల్లో పెద్ద సక్సెస్ అయిన మాస్టర్ చెఫ్ ఖచ్చితంగా తెలుగు లో కూడా సెన్షేషనల్ రేటింగ్ దక్కించుకుంటుందని అంతా ఊహించారు. కాని అనూహ్యంగా షో కు రేటింగ్ దారుణంగా ఉంది. మాస్టర్ చెఫ్ మరియు ఎవరు మీలో కోటీశ్వరులు షో ను కూడా ఒకే వారంలో ప్రారంభించారు. రెండు షో లతో జెమిని టీవీ రేటింగ్ లో దూసుకు పోతుందని అంతా భావించారు. కాని అనుకున్నది ఏమీ జరగలేదు. షో నిర్వాహకులు తీవ్రంగా నిరుత్సాహంలో ఉన్నారు. మాస్టర్ చెఫ్ ఫినాలే ఎపిసోడ్ లో అయినా తమన్నాను తీసుకు వస్తారా అనేది చూడాలి.