Begin typing your search above and press return to search.
తిట్టి మరీ పొగిడిన అనసూయ!!
By: Tupaki Desk | 30 Aug 2017 10:25 PM ISTయాంకర్ కం యాక్ట్రెస్ గా టాప్ ఫాంలో ఉన్న హాట్ బ్యూటీ అనసూయా భరద్వాజ్. నటిగాను.. ఐటెం బ్యూటీగానూ మెప్పించేస్తున్న ఈ భామ.. అభిప్రాయాలు వెల్లడించడంలో కూడా మహా స్పీడ్. ఏ టాపిక్ పై అయినా ఈమె ఓ విషయం చెప్పాలని భావిస్తే.. ఆపడం ఎవరి తరం కాదు. ఇవాళ సడెన్ గా ఈమెకు ఓ వ్యవహారంపై మండుకొచ్చింది. అందుకే వెంటనే ట్విట్టర్ ఓపెన్ చేసి చకచకా ట్వీట్స్ పెట్టేసింది.
"అంతా బాగానే ఉంది.. కానీ అమ్మను తిట్టడం కూడా ఓకేనా? కరెక్టే.. ఇదో ప్రయోగమే.. కానీ ఇలా చేసేయచ్చని ఎలా అనుకుంటారు.. వేలు.. లక్షల మంది ఫాలోయింగ్ లభించడం ఎంతో అదృష్టం కదా.. కానీ ఇది పెద్ద బాధ్యత కదా.. దీన్ని నేను ఇష్యూ చేయాలని అనుకోవడం లేదు. కానీ సైలెంట్ గా ఉండడం నావల్ల కాలేదు. ఇది చాలా చీప్ గా ఉంది" అంటూ కస్సుమంది అనసూయ. ఇక్కడి వరకూ చదివితేనే.. ఇదంతా అర్జున్ రెడ్డి విషయంలో విజయ్ దేవరకొండ బిహేయివర్ ను బేస్ చేసుకుందని అర్ధమవుతున్నా.. ఆ మాట మాత్రం ముందుగా అనసూయ చెప్పలేదు.
"నీ జీవితంలో ఉన్న మహిళ గురించి మరొకరు ఇలాగే మాట్లాడితే అప్పుడేం చేస్తావ్ డూడ్.. వారి లేడీస్ ను తిడతావా.. అప్పుడు తేడా ఏంటి..ఎందుకు ఏంటి లాంటివి కాదు.. ట్యాలెంటెడ్ టీం తమ స్కిల్ ను సరిగా ఉపయోగించుకోవాలి. నైతికంగా ఉండాలి. ఫస్ట్ లుక్ చూసి అందరిలాగే నాకు కూడా మైండ్ బ్లాంక్ అయింది. కానీ పబ్లిక్ మీటింగ్స్ లో టీం మాట్లాడిన పద్ధతి సరికాదు. ఇలాంటి మాటలు వినే ధైర్యం నాకు లేదు" అంటూ టీం అర్జున్ రెడ్డి అని చివరలో హ్యాష్ ట్యాగ్ పెట్టి.. గట్టిగానే తిట్టిపోసింది అనసూయ.