Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: బాపు బొమ్మకే బామ్మలా ఉందే
By: Tupaki Desk | 27 Feb 2020 5:41 AM GMTఅనసూయ.. రాజసూయం గురించి ప్రత్యేకించి చెప్పాలా! బుల్లితెర వెండితెర అనే డిఫరెన్స్ లేకుండా అన్నిచోట్లా ఏలేస్తోంది. ఓవైపు వరుసగా బుల్లితెర కార్యక్రమాల్ని నడిపిస్తూనే మరోవైపు సహాయక నటిగా వెండితెరపైనా వెలుగులు విరజిమ్ముతోంది. నాలుగు చేతులా ఆర్జిస్తూ అపార్ట్ మెంట్లు.. ఆఫీసుల్లో పెట్టుబడులు పెడుతోందన్న టాక్ ఇప్పటికే లీకైంది.
అది సరే కానీ.. ప్రస్తుతం అనసూయ ప్రతిరోజు పండగే అనే బుల్లితెర కార్యక్రమంలో ఓ రేంజులో అలరించేందుకు ప్లాన్ చేసింది. ఈటీవీలో ఈ కార్యక్రమం టెలీకాస్ట్ అవుతోంది. మధ్యాహ్నం 12 తర్వాత ట్రీట్ ఉందిలే అంటూ అనసూయ స్వయంగా ట్వీట్ చేస్తూ ఆన్ లొకేషన్ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. అవును అనసూయ అందాలతో ప్రతిరోజూ పండగే. చీరలో అనసూయ సొగసు టీవీక్షకులకు పండగనే తెస్తోంది. ఇంకా చెప్పాలంటే బాపు బొమ్మ అంత అందంగా ముస్తాబై ఈ కార్యక్రమం టీఆర్పీని పరుగులు పెట్టించేందుకు రెడీ అయ్యింది. సమాధి నిద్దుర లేచి బాపునే స్వయంగా రంగులద్దారా! అన్నంతగా డిజైన్ చేశారు మరి. ఇదంతా ఫ్యాష న్ డిజైనర్ గౌరీనాయుడు ప్రతిభ అని అనసూయ తెలిపింది.
జబర్దస్త్ - లోకల్ గ్యాంగ్స్ అంటూ వరుస కార్యక్రమాలతో రఫ్ఫాడించేస్తూనే ఎప్పటికప్పుడు నిత్య నూతన కార్యక్రమాలతో ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంది. ప్రతిరోజు పండగే షూట్ లొకేషన్ నుంచి ఫోటో లీకులతోనే యూత్ ఫిదా అయిపోతున్నారు. ఈ కార్యక్రమం బుల్లితెరపై ఏ లెవల్లో వర్కవుట్ అవుతుందో చూడాలి.