Begin typing your search above and press return to search.
షాక్: మరో నటుడి యాక్సిడెంట్!
By: Tupaki Desk | 18 Jun 2019 5:53 AM GMTవరుసగా షాక్ ల మీద షాక్ లు తగుల్తున్నాయ్. టాలీవుడ్ కి ఏమైందో కానీ వరుస పెట్టి యాక్సిడెంట్లు బెంబెలెత్తిస్తున్నాయి. ఈ వారం రోజుల్లోనే మూడు యాక్సిడెంట్లు కంగారు పెట్టాయి. యువహీరోలు వరుణ్ తేజ్.. శర్వానంద్.. నాగశౌర్య.. ప్రమాదాలకు గురైన సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్ రోడ్ యాక్సిడెంట్ కాస్త తీవ్రమైనదే. అదృష్టవశాత్తూ కార్ లో బెలూన్ ఓపెన్ అవ్వడంతో సేఫ్ అయిపోయాడు.
ఈ ప్రమాదాల గురించి మాట్లాడుకుంటుండగానే మరో నటుడి ప్రమాద వార్త అందింది. జబర్దస్త్ యాక్టర్ చలాకి చంటికి తృటిలో రోడ్డు ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. కోదాడ హైవేపై వెళ్తుండగా కొమరబండ వద్ద లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నటుడు చలాకి చంటికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద స్థలంలో నుంచి స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చంటిని స్థానికంగా ఉన్న తిరుమల ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఈ ప్రమాద సమయంలో చంటి డ్రైవ్ చేస్తున్నారా.. లేక తన డ్రైవర్ ఉన్నాడా? అన్నది పోలీసులు విచారిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఉదయం ఆరున్నర గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. అయితే ఇదివరకూ ఓసారి చంటి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రెండోసారి యాక్సిడెంట్ కి గురయ్యారు. అతడు వెళుతున్న కార్ ముందు భాగం తీవ్రంగా దెబ్బ తింది. ఈ వారంలో ఇది నాలుగో యాక్సిడెంట్ అని చెప్పాలి.