Begin typing your search above and press return to search.

జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ భార్య ఆత్మ‌హ‌త్య‌!

By:  Tupaki Desk   |   20 Dec 2016 10:50 AM GMT
జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ భార్య ఆత్మ‌హ‌త్య‌!
X
జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ భార్య ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది! ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మం ఎంత పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎంతోమంది క‌మెడియ‌న్లు ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే కొన్ని నెల‌ల కింద‌టి నుంచీ జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మాలో క‌నిపిస్తున్నాడు పొట్టి ర‌మేష్‌. విశాఖ‌ప‌ట్నానికి చెందిన ఈ క‌మీడియ‌న్ డాన్స‌ర్ కూడా! ఏడాది కింద‌టే త్రిపురాంబిక‌తో పెళ్లి అయింది.

అయితే, త్రిపురాంబిక అనూహ్యంగా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. గాజువాక‌లోని వారి ఇంట్లో ఆమె బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. కొన్ని రోజులుగా ఆమె తీవ్ర‌మైన మాన‌సిక ఒత్తిడికి గురౌతున్న‌ట్టు స్థానికులు చెబుతున్నారు. గ‌డ‌చిన ఓ మూడు నాలుగు రోజుల నుంచీ ఆమె గ‌ది త‌లుపు కూడా తీయ‌లేద‌ట‌. దాంతో ఆమె అత్త‌వారే గ‌ది త‌లుపుల్ని ప‌గులగొట్టారు. అప్ప‌టికే ఆమె ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విష‌యం తెలియ‌గానే పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌ లో షూటింగ్‌లో ఉన్న పొట్టి ర‌మేష్, ఈ విష‌యం తెలుసుకుని హుటాహుటిన వైజాగ్‌ కు వ‌చ్చారు. ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టానికి దారి తీసిన కార‌ణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పొట్టి ర‌మేష్‌ తో ఆమెకి ఇష్టం లేని పెళ్లి జ‌రిగింద‌నీ, అత‌డిని పెళ్లి చేసుకోవ‌డం ఆమెకు సుతార‌మూ ఇష్టం లేద‌నీ, బల‌వంతం మీద ఈ పెళ్లి కుదిరింద‌ని స్థానికులు కొంత‌మంది చెబుతున్నారు. ఇదే కోణం నుంచి పోలీసులు కూడా ద‌ర్యాప్తు ప్రారంభించామ‌నీ, అత్త‌వారి కుటుంబ స‌భ్యులను ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/