Begin typing your search above and press return to search.

జబర్దస్థ్ వినోద్ పెళ్లి అందుకే ఆగిందట!

By:  Tupaki Desk   |   26 Dec 2019 4:43 AM GMT
జబర్దస్థ్ వినోద్ పెళ్లి అందుకే ఆగిందట!
X
ఓవైపు తప్పు పడుతూనే.. మరోవైపు అమితంగా ఆదరించే కామెడీ షోలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి రేర్ క్రేజ్ ను క్రియేట్ చేసుకోవటంలో జబర్దస్త్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి. జబర్దస్త్ కామెడీ షోలో ద్వందార్థాలు ఎక్కువగా ఉంటాయి.. అడల్ట్ జోకులు అంతకంతకూ శ్రుతిమించుతాయని చెప్పినప్పటికీ.. ఆ షోకు ఉండే ప్రేక్షకాదరణ అంతా ఇంతా కాదు.

ఈ కారణంతోనే ఈ కార్యక్రమానికి పోలిన విధంగా పలు చానళ్లలో కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పాలి. ఇక.. జబర్దస్త్ షో కారణంగా ఎంతోమంది నటులు సెలబ్రిటీలు కావటమే కాదు.. వారికి భారీ గుర్తింపు లభించింది. జబర్దస్త్ షో చూసే వారికి వినోద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అచ్చం అమ్మాయిలా కనిపించటమే కాదు.. తన వాలు చూపులతో కిక్కెక్కించే ఇతగాడు అమ్మాయి వేషంలోనే ఎక్కువగా కనిపిస్తాడని చెప్పాలి. వినోద్ ను అబ్బాయిగా ఇటీవల కాలంలో చూసినోళ్లు చాలా తక్కువనే చెప్పాలి.

ఇటీవల కాలంలో వినోద్ పేరు పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. పెళ్లి ఫిక్స్ అయి.. ఎంగేజ్ మెంట్ అయ్యాక క్యాన్సిల్ కావటం.. ఇంటి యజమానితో గొడవ.. దాడి జరగటం.. కేసుల వరకూ విషయం వెళ్లటం.. మరోసారి ఆత్మహత్యాయత్నం లాంటి ఘటనలతో తరచూ వార్తల్లో కనిపిస్తుంటాడు.

తాజాగా ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చాడు. తనకు దక్కిన ప్రత్యేక గుర్తింపు జబర్దస్త్ పుణ్యమేనని చెప్పిన అతడు.. తన పెళ్లి గురించి తాజా వివరాల్ని వెల్లడించాడు. తన ఎంగేజ్ మెంట్ అయిపోయిందని తాను మానసికంగా.. శారీరకంగా స్ట్రాంగ్ గా మారిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

తాను పెళ్లాడబోయే అమ్మాయి తమ బంధువేనని.. తనగురించి చిన్నప్పటి నుంచి అన్ని తెలుసు.. చూస్తుంది కాబట్టి ఫ్యూచర్ లోనూ ఎలాంటి సమస్య ఉండదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. అయితే.. తన ఇంటి ఓనర్ తో జరిగిన గొడవ గురించిన వివరాల్ని మాత్రం పెద్దగా బయటపెట్టకపోవటం గమనార్హం.