Begin typing your search above and press return to search.

కంటతడి పెట్టిస్తున్న పంచ్ ప్రసాద్ వీడియో.. అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా?

By:  Tupaki Desk   |   19 Nov 2022 4:31 AM GMT
కంటతడి పెట్టిస్తున్న పంచ్ ప్రసాద్ వీడియో.. అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా?
X
తెర మీద వెలిగిపోయే తారల జీవితాలు తెర వెనుక మరోలా ఉంటాయి. వారి జీవితాల్లోని కష్టాల గురించి తెలిస్తే నోట మాట రాదంతే. జబర్దస్త్.. శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర కార్యక్రమాల్లో తన టైమింగ్ పంచ్ లతో అందరిని నవ్వించే పంచ్ ప్రసాద్ కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు షాకింగ్ గా మారింది.తాను వేసే స్కిట్ లో ఒకసారి తన ఆరోగ్య సమస్యను షేర్ చేసుకున్నప్పటికి.. అప్పుడు వేసిన పంచ్ తో అది కాస్త తెర మరుగున పడింది. కానీ.. అంతటి బాధను పంటి బిగువునా భరిస్తూ.. ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయించిన అతని ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు.

'నీ పంచ్ ల వల్ల నా రెండు కిడ్నీలు పోయాయి. నేను ఎవరికైనా చెప్పానా?' అంటూ తన పర్సనల్ ప్రాబ్లంను సైతం పంచ్ రూపంలో వేసిన ప్రసాద్.. నిజాన్నే చెప్పాడు. కానీ.. దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ మాటకు వస్తే.. తాను పడుతున్న ఆరోగ్య ఇబ్బందుల గురించి షేర్ చేసింది లేదు. తన అనారోగ్యం గురించి బయటకు చెప్పుకోవటానికి ఇష్టపడని ప్రసాద్ గురించి అసలు విషయాలు చెప్పేందుకు జబర్దస్త్ ఫేం నూకరాజు రంగంలోకి దిగారు.

ప్రసాద్ వద్దన్నా.. ఒక వీడియోను తీసి యూట్యూబ్ లో పోస్టు చేశాడు. ఈ వీడియోను చూసినోళ్లంతా షాక్ తింటున్నారు. రెండుకిడ్నీలు దెబ్బతిని.. తరచూ డయాలసిస్ చేయించుకుంటున్న ప్రసాద్.. ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్న విషయాన్ని తన వీడియోలో చూపించాడు. ఈ విషయాన్ని ప్రసాద్ కు తెలీకుండా షూట్ చేసినట్లుగా పేర్కొన్నాడు. ప్రసాద్ కు ఇప్పుడు కావాల్సింది మీ ఆశీస్సులు.. అండదండలు అంటూ పేర్కొన్నారు.

ఆ మధ్యన షూట్ పూర్తి చేసుకొని వచ్చి జ్వరంగా ఉందని పడుకున్నాడని.. ఆ తర్వాత ఓవైపు నొప్పి వస్తుందని చెబితే డాక్టర్ సలహాతో పెయిన్ కిల్లర్ ఇచ్చినట్లుగా ప్రసాద్ భార్య వీడియోలో వెల్లడించారు. తర్వాతి రోజు డయాలసిస్ కు వెళ్లి వచ్చి విశ్రాంతి తీసుకున్నా నడుము నొప్పి తగ్గకపోవటంతోవైద్యులకు చూపించినట్లు చెప్పారు. మొదట్లో నొప్పి ఎందుకు వస్తుందో అర్థం కాలేదన్న వైద్యులు.. ఎంఆర్ఐ స్కానింగ్ లో అసలు విషయం బయటకు వచ్చిందన్నారు.

"నడుము వెనుక భాగం నుంచి కాలి వరకు చీము పట్టింది. డయాలసిస్ చేయించుకునే రోగుల్లో నెమ్మదిగా ఇలాంటి సమస్యలు వస్తాయట. టెస్టు తర్వాత అది మందులతో నయం అవుతుందా? ఆపరేషన్ అవసరమా? అన్నది వైద్యులు చెబుతారు" అంటూ నూకరాజు తన వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం అతనున్న ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటకు వచ్చి.. తన పంచ్ లతో అందరిని నవ్వించాలని కోరుకుందాం. అదే సమయంలో.. అతడికి స్వస్థత చేకూరాలని మనసారి ప్రార్థిద్దాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.