Begin typing your search above and press return to search.
బెల్లంకొండకు అరెస్ట్ ముప్పు తప్పదా?
By: Tupaki Desk | 1 Aug 2019 4:57 AM GMTప్రముఖ సినీ నిర్మాత.. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే బెల్లంకొండ సురేశ్ తాజాగా అరెస్ట్ ముప్పును ఎదుర్కంటున్నారు. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఒక ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ తాజాగా కోర్టు నుంచి పొందిన వారెంట్ నేపథ్యంలో బెల్లంకొండకు అరెస్ట్ ముప్పు పొంచి ఉన్నట్లు చెబుతున్నారు. ఇంతకీ.. బెల్లంకొండకు అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ అయ్యిందన్న విషయంలోకి వెళితే..
ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ 2010లో బాండ్ బాజా బరాత్ మూవీని తీసింది. ఇది హిందీలో ఘన విజయాన్ని సాధించింది. ఇదిలా ఉంటే 2013లో బెల్లంకొండ సురేశ్.. జబర్దస్త్ పేరుతో సిద్ధార్థ్. సమంతాలతో కలిసి సినిమా తీశారు. తమ బాండ్ బాజా బరాత్ చిత్రంలోని 19 సీన్లను బెల్లంకొండ తమ చిత్రంలో కాపీ చేశారంటూ యశ్ రాజ్ ఫిలింస్ ఆరోపిస్తూ కేసు వేసింది.
దీంతో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. ఇదిలా ఉంటే.. తాను తీసిన జబర్ధస్త్ మూవీ శాటిలైట్ రైట్స్ ను ఒకమీడియా ఛానల్ కు రూ.3.5 కోట్లకు అమ్మేశారు. యశ్ రాజ్ ఫిలింస్ కంప్లైంట్ మేరకు ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయటంతోపాటు.. టీవీలో కూడా టెలికాస్ట్ చేయొద్దని ఆదేశించింది. దీంతో.. సదరు చానల్ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేశ్ ను తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరారు.
అయితే.. ఆయన ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా వాయిదాలు వేస్తున్నారు. దీంతో తమకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వని సురేశ్ మీద సదరు చానల్ కోర్టును ఆశ్రయించింది. దీంతో.. తాజాగా బెల్లంకొండ సురేశ్ ను అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే సదరు ఛానల్ తామిచ్చిన రూ.3.5 కోట్లు ఇప్పుడు రూ.11.75 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొంది. మరీ.. నేపథ్యంలో అరెస్ట్ ముప్పు నుంచి బెల్లంకొండ సురేశ్ ఏ రీతిలో తప్పించుకుంటారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.