Begin typing your search above and press return to search.
ఆ మూడు సార్లు.. చచ్చేంత భయమేసింది!
By: Tupaki Desk | 1 July 2015 10:30 PM GMTనల్ల వేణు.. జబర్ధస్త్ వేణు.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. దాదాపు 11 సంవత్సరాల క్రితం 'జై' అనే సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు వేణు. వందల సినిమాల్లో నటించేశాడు. కమెడియన్‌గా ఆకట్టుకున్నాడు. ఈ సుదీర్ఘ పయనంలో ఎన్నో మర్చిపోలేని సంఘటనలు. ఇంచుమించు సాహసాలతో సావాసం చేశాడు వేణు. గుండె ఆగిపోయేంతటి పీక్ సీన్స్ ఓ రెండు చెప్పాడిలా.
ఒకసారి తేజ దర్శకత్వంలో ఔనన్నా కాదన్నా చిత్రీకరణ సాగుతోంది. గోదావరిలో షూటింగ్. ఉదయ్‌కిరణ్, నేను, సుమన్ శెట్టి తెప్పమీద గోదారి పయనం చేస్తున్నాం. ఇట్నుంచి బాగానే వెళ్లాం. అట్నుంచి వచ్చేప్పుడే గోదారిలో ఫ్లో పెరిగింది. స్పీడ్‌కి తెప్పలోకి నీళ్లొచ్చేశాయి. ఇక ఇదే చివరి రోజు. అయిపోయా అనుకున్నా. కానీ ఉదయ్‌కిరణ్ ఎంతో ధైర్యంగా తెప్పను ఒడ్డెక్కించాడు. తెడ్డు వేసి నీళ్లు తోడి డేరింగ్‌గా మమ్మల్ని గట్టునపడేశాడు. అప్పటివరకూ పెద్ద టెన్షన్. ఆ సీన్ తర్వాత చాలా కాలం తేరుకోలేకపోయా.
అలాగే 'దొంగలబండి' షూటింగ్ తలకోనలో జరిగింది. అప్పుడు ఆ షూటింగ్ పూర్తి చేసుకుని మర్నాడు వేరొక షూటింగులో ఠంచనుగా పార్టిసిపై చేయాల్సిన సందర్భం. కానీ రైలు మిస్సయ్యింది. ఫలానా స్టేషన్‌లో క్రాస్ చేసి రైలెక్కేయొచ్చు అని సలహా ఇచ్చాడో ఆసామి. అంతే వెంటనే పరుగో పరుగు. ట్రెయిన్‌ని ఛేజ్ చేసి స్టేషన్‌కి వెళితే.. తీరా ట్రెయిన్ మిస్సింగ్. స్టేషన్‌లో కదిలిపోయిన ట్రెయిన్ వెంట పరుగులు పెట్టి చివరికి ఏదోలా రైలెక్కేశాం. సమరసింహారెడ్డి రేంజు ఛేజింగ్ అది. ఎప్పటికీ మర్చిపోలేను.. బాబోయ్ అంటూ ఊపిరి పీల్చుకున్నాడు వేణు.
ఓసారి హైదరాబాద్‌లో ప్రభాస్ సినిమా షూటింగ్. అందులో ఓ సీరియస్ డైలాగ్. అర్థరాత్రి టెర్రాస్‌పై షూటింగ్. ఓ వైపు నిద్రమత్తు. డైలాగ్ చెప్పడానికి రెడీ అవుతున్నా.. సరిగ్గా అప్పుడే ఫోన్ రింగంది. వదిలేసి మళ్లీ డైలాగ్ చెప్పబోతున్నా.. మళ్లీ సేమ్ టైమ్ రింగింగ్. ఇలా పది టేకులు తిన్నా. చివరికి వంశీ పైడిపల్లి గారు తిట్టబోతుంటే ప్రభాస్ గారు వచ్చి నేనే ఇలా రింగ్ చేశా.. అంటే అంత భళ్లున నవ్వేసుకున్నారు.
ఆన్‌సెట్స్ ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్, అప్పుడపుడు భయం కలిగించేవి ఉంటాయి. ఇవన్నీ జీవితంలో తీపి గురుతులు.. అంటూ చెప్పుకొచ్చాడు.