Begin typing your search above and press return to search.
మన హీరోయిన్ కు జాకీ ఛాన్ గిఫ్ట్
By: Tupaki Desk | 9 Jun 2019 9:53 AM GMTఇంటర్నేషనల్ స్టార్ అయిన జాకీ ఛాన్ బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ కు సాంప్రదాయ బద్దమైన శాలువాను బహుమానంగా ఇచ్చాడట. తాజాగా చైనాలో జరిగిన 'కాబిల్' చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని హృతిక్ రోషన్ కు మరియు యామీ గౌతమ్ కు తన తరపున శాలువాను బహూకరించినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో 2017వ సంవత్సరంలో విడుదలైన కాబిల్ ను చైనాలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
చైనాలో కాబిల్ ప్రమోషన్ కార్యక్రమాల్లో హృతిక్ రోషన్ పాల్గొన్నాడు. ఆ సందర్బంగా సినిమాను చూసిన జాకీ ఛాన్ హీరో హృతిక్ రోషన్ మరియు హీరోయిన్ యామీ గౌతమ్ లను అభినందించాడట. ఆ సమయంలోనే హృతిక్ రోషన్ మరియు ఛాన్ లు ఫొటోలకు ఫోజ్ లు ఇచ్చారు. తనకు జాకీ ఛాన్ బహుమానం ఇవ్వడం పట్ల యామీ గౌతమ్ ఉబ్బి తబ్బిబవుతోంది. ఆమె ఆనందానికి అవధులు లేకుండా ఉంది.
ఆమె తనకు దక్కిన బహుమానం గురించి మాట్లాడుతూ.. జాకీ చాన్ నాకు బహుమానం ఇచ్చారనే విషయం తెలిసి వెంటనే ఆశ్చర్యపోయాను. నేను ఆయన్ను కలువలేక పోయాను. ప్రస్తుతం నేను 'బాలా' చిత్రం షూటింగ్ లో ఉన్నాను. నాకు ఆయన నుండి పార్శిల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి కూడా ఆయన అభిమానిని. అలాంటిది ఆయన నుండి గిఫ్ట్ పొందడం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు కలవలేక పోయినా భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి జాకీ ఛాన్ ను కలుస్తానంటూ యామీ చెప్పుకొచ్చింది.