Begin typing your search above and press return to search.

కుంగ్ ఫూ యోగా.. జాకీ ఉండబట్టే స్పెషల్

By:  Tupaki Desk   |   5 Feb 2017 8:14 AM GMT
కుంగ్ ఫూ యోగా.. జాకీ ఉండబట్టే స్పెషల్
X
ఇంటర్నేషనల్ స్టార్ జాకీ చాన్ సినిమాలకు ఇండియాలో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ జాకీచాన్ కు అభిమానులు ఉంటారు. అందుకే ఇండో-చైనీస్ మూవీగా తెరకెక్కిన జాకీచాన్ లేటెస్ట్ మూవీ కుంగ్ ఫూ యోగాను.. స్థానిక భాషల్లో కూడా రిలీజ్ చేశారు.

తెలుగులో కూడా కుంగ్ ఫూ యోగా రిలీజ్ అయింది. ట్రెజర్ హంట్ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో జాకీచాన్ నటించడమే అన్నిటికంటే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. అటు చైనా.. ఇటు ఇండియా కల్చర్స్ ను ప్రతిబింబిచేలా రూపొందించారు. ఇండియన్ ఆడియన్స్ కు బాగా పరిచితమైన అరుంధతి విలన్ సోనూ సూద్ నటించడం.. భారతీయ ప్రేక్షకులను మరింతగా ఆకర్షించింది. ఇక దిశా పటాని.. అమైరా దస్తూర్ లు హీరోయిన్లుగా నటించగా.. ఇండియన్ మూవీస్ టైపులో ఓ పాటను కూడా పెట్టి.. జాకీచాన్ తో కూడా స్టెప్పులు వేయించడం విశేషం.

అయితే.. నిధుల వేట కాన్సెప్ట్ తప్ప కొత్తగా ఏమీ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమ పూర్వీకులకు చెందిన నిధిని కనుగొనేందుకు జాకీచాన్ ను దిశా పటానీ హెల్ప్ అడగడం.. అదే నిధిపై విలన్ సోనూసూద్ పై కన్నేయడం.. నిధిని ఓపెన్ చేయాలంటే లండన్ మ్యూజియంలోని ఓ వజ్రం కావాల్సి ఉండడం.. దాని కోసం హీరో-విలన్ లు చేతులు కలపడం వంటివి.. సహజంగా మనం చాలా సినిమాల్లో చూసినవే. అయినా పైగా జాకీచాన్ నుంచి ఎక్స్ పెక్ట్ చేసే స్టంట్స్ లేకపోవడం కూడా లోటు అంటున్నారు ప్రేక్షకులు. మొత్తం మీద ఎంటర్టెయినింగ్ గా ఉన్నా.. జాకీచాన్ నుంచి ఆశించిన స్థాయిలో మాత్రం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/